/rtv/media/media_files/2025/07/07/tg-icet-results-2025-2025-07-07-16-16-41.jpg)
TG ICET Results 2025
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఐసెట్ (TG ICET Results 2025) ఫలితాలు నేడు (సోమవారం) విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) కార్యాలయంలో ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.
Also Read : 'అందులో తప్పేముంది'.. సీఎం పదవిపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
Also Read : మంత్రి ఆనం Vs నారాయణ.. పేలిన మాటల తూటాలు
TG ICET Results 2025
పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను, ర్యాంకు కార్డులను అధికారిక వెబ్‌సైట్ https://icet.tgche.ac.in/ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలతో పాటు తుది 'కీ'ని కూడా విడుదల చేశారు. ఐసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. కౌన్సిలింగ్ ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ సీట్లను కేటాయిస్తారు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ, నల్గొండ తరపున TGCHE నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్ష జూన్ 8, 9 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో జరిగిన విషయం తెలిసిందే.
Also Read : అయ్యో బిడ్డా.. తెలంగాణలో ప్రాణం తీసిన ఫ్యాన్.. 9 ఏళ్ల చిన్నారి మృతి
Also Read : ప్రేమికుల సూసైడ్...పెద్దలు ఒప్పుకోలేదని బ్లేడ్ తో కోసుకుని..
ts-icet | TS ICET Results 2025