/rtv/media/media_files/2025/07/07/love-jihad-2025-07-07-15-48-00.jpg)
తన భర్త బలవంతంగా గొడ్డు మాంసం తినమని, మతమార్పిడి చేయించుకోవాలని, ఖురాన్ చదవమని బలవంతం చేస్తున్నట్లుగా ఓ వివాహిత ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జిహాద్ కింద కేసు బుక్ చేశారు. ఈ ఘటన ఇండోర్ లో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం .. ఆర్తి కుమారి అనే మహిళకు మొహమ్మద్ షెహబాజ్ తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఐదు సంవత్సరాల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక వీరి సంసారం కొన్ని రోజులు బాగానే ఉంది.
Also Read : పాక్ గూఢచారి జ్యోతికి రాచమర్యాదలు...ఏకంగా ఆ రాష్ట్ర అతిథిగా....కేరళ శారీలో..
Also Read : క్యాన్సర్ విషయం చెప్తాడని అనుకోలేదు.. ఆకాశ్‌దీప్ సోదరి ఎమోషనల్
గొడ్డు మాంసం తినమని
ఆ తరువాత షెహబాజ్ తన భార్యను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. గొడ్డు మాంసం తినమని, మతమార్పిడి చేయించుకోవాలంటూ టార్చర్ మొదలుపెట్టాడు. అంతేకాకుండా తన భార్య ఫోన్ లో ఉన్న హిందూ దేవుళ్ల ఫోటోలను కూడా డీలీట్ చేశాడు. తన భర్త డిమాండ్లకు తాను కట్టుబడి ఉండకపోవడంతో తనపై శారీరకంగా దాడి చేశాడని ఆర్తి చెబుతోంది. షెహబాజ్ తాను బంగారం, వెండి వ్యాపారిగా పరిచయం చేసుకున్నాడని, కానీ వాస్తవానికి అతను ఓ దుకాణంలో దండలు మాత్రమే తయారు చేసేవాడని తేలిందన్నారు. తన పరిస్థితి గురించి ఆర్తి మాట్లాడుతూ పెళ్లైనప్పటి నుండి తన తల్లిదండ్రులతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది.
అయితే ఈ ఆరోపణలపై ఆమె భర్త షెహబాజ్ స్పందిస్తూ తాను ఎటువంటి తప్పు చేయలేదని, ఆర్తికి గతంలో వివాహం అయి ముగ్గురు పిల్లలు ఉన్నారని పేర్కొన్నాడు. ఆమెకు పిల్లల పుట్టకుండా ఆపరేషన్ కూడా జరిగిందని, ఆమెకు ఇతర పురుషులతో కూడా సంబంధాలు ఉన్నాయని ఆరోపించాడు. అంతేకాకుండా ఐదు సంవత్సరాలలో మూడుసార్లు ఇంటి నుండి పారిపోయిందని షాబాజ్ అన్నారు. చదవడం కూడా రాని ఆమెను తాను గొడ్డు మాంసం తినమని లేదా ఖురాన్ చదవమని ఎందుకు అడుగుతానని అని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : ఫోటోలకు పోజులిస్తూ .. చూస్తుండగానే కావేరి నదిలో కొట్టుకుపోయాడు!
Madhya Pradesh | bihar | beef | indore | love-jihad