/rtv/media/media_files/2025/07/07/ap-lands-registrations-2025-07-07-15-34-57.jpg)
AP Lands Registrations
ఏపీ ప్రభుత్వం అక్కడి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట కేవలం రూ.100 కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌లు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే అది వారసత్వ భూముల సంక్రమణ భాగస్వామ్య (సక్సెషన్) రిజిస్ట్రేషన్ కు మాత్రమే వర్తిస్తుంది. ఇకమీదట నామమాత్ర ఫీజుతో గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. మార్కెట్ విలువ ప్రకారం సంబంధిత ఆస్తి విలువ రూ.10లక్షల లోపు ఉంటే రూ.100, ఆపైన ఉంటే రూ.1,000 ఫీజును స్టాంపు డ్యూటీ కింద తీసుకోనున్నారు. దీన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించాల్సి ఉంది.
ఇది కూడా చూడండి:Eggs: గుడ్లు ఎవరు తినొద్దు ఎప్పుడు తినొద్దు? తింటే కలిగే చెడు ప్రభావాల గురించి ఇప్పుడే తెలుసుకోండి
Land Registration For Just Rs.100 In AP
అయితే సదరు ఆస్తి యజమానులు మరణిస్తే వారి అనంతరం వారసులకు సంక్రమించే ఆస్తులకు మాత్రమే గ్రామ/వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయనున్నారు. మిగిలిన ఆస్తులకు మాత్రం ఎప్పటిలాగే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇప్పటివరకు తల్లిదండ్రులు మరణించిన వారు వారి వారసత్వంగా వచ్చే ఆస్తులను తహసీల్దారుకు దరఖాస్తుచేసుకుని ఆ తర్వాత కాగితాలపై రాసుకుంటున్నారు. అయితే అలా రాసుకున్న వాటికి మ్యుటేషన్‌లు సకాలంలో జరగడం లేదు. దీంతో వారసులు తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సిబ్బంది సైతం దీన్ని ఆసరాగా చేసుకుని వారిని పదేపదే తిప్పుతున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ విషయలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ విషయంలో గత ఏడాది ప్రభుత్వానికి సుమారు 55 వేల ఫిర్యాదులు అందాయి. ఇదిలా ఉంటే మరికొంతమంది మాత్రం తమ ఆస్తికి మరోసారి రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం ఏంటన్న ఉద్దేశంతో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల భూముల రికార్డుల్లో చనిపోయిన వారి పేర్లు అలాగే ఉండిపోతున్నాయి. ఫలితంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి.
ఇది కూడా చూడండి:AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో
ఇప్పటివరకు మరణ ధ్రువీకరణ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు మాత్రమే గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా జారీ చేస్తున్నారు. ఇక మీదట యజమాని మరణించిన తర్వాత వచ్చిన ఆస్తులను వారసులు పంచుకునేందుకు లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంతో వస్తే గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ ను పూర్తి చేస్తారు. అది కూడా కేవలం తక్కువ ఫీజుతో రిజిస్ట్రేషన్ చేయడం వల్ల వారసులు రిజిస్ట్రేషన్ కోసం ముందుకు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల భూముల రికార్డుల్లో వివరాల నమోదు ప్రక్రియ ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. జరుగుతుంది. దానితో పాటు ఈ-పాస్‌బుక్ కూడా జారీ అవుతుంది. వారసులుగా ఉన్న వారి నుంచి ఈ-కేవైసీ సైతం తీసుకుంటారు.
ఇది కూడా చూడండి:IND vs ENG : ఆకాష్ దెబ్బ...ఇంగ్లాండ్ అబ్బా : రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ!
ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. దీనికి అనుగుణంగా రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ విధానం వెంటనే అమల్లోకి వచ్చే అవకాశం లేదు. దీనికి మరో రెండు, మూడు నెలల సమయం పడుతోంది. స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పర్యవేక్షణలో వారసత్వ భూములకే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
ఇది కూడా చూడండి: Director Sandeep Raj: చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..
Telugu Heritage | heritage-building | ap cm chandrababu naidu | AP Secretariat employees | ap-secretariat | registrations | lands