Uttam Kumar Reddy : మోటార్లను ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలుసు..హరీశ్ రావుకు ఉత్తమ్ కుమార్ కౌంటర్

కల్వకుర్తి లిఫ్ట్ మోటార్లు ఆన్ చేయడం లేదన్న బీఆర్ఎస్ నేత హరీష్‌ రావు విమర్శలకు నీటిపారుదల శాఖ మంత్రి  ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. మోటార్లను ఎప్పుడు ఆన్ చేయాలో తమకు తెలుసన్నారు. ప్రతియేటా జులై చివరన లేదా ఆగస్టు 1న మోటార్లు ఆన్ చేస్తారన్నారు.

New Update
Uttam kumar Reddy

Uttam kumar Reddy

Uttam Kumar Reddy : కల్వకుర్తి లిఫ్ట్ మోటార్లు ఆన్ చేయడం లేదన్న బీఆర్ఎస్ నేత హరీష్‌ రావు విమర్శలకు నీటిపారుదల శాఖ మంత్రి  ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. మోటార్లను ఎప్పుడు ఆన్ చేయాలో తమకు తెలుసన్నారు. ప్రతియేటా జులై చివరన లేదా ఆగస్టు 1న మోటార్లు ఆన్ చేస్తారన్నారు. గోబెల్స్ కు మించి అబద్ధాలు ప్రచారం చేయడం హరీష్ రావుకు అలవాటని ధ్వజమెత్తారు. కన్నెపల్లి పంప్ హౌస్ పై హరీష్ రావు కల్లబొల్లి మాటలు నమ్మాల్సిన అవసరంలేదన్నారు. ‘‘కల్వకుర్తి లిఫ్ట్ ప్రాజెక్టును జూలై చివరి వారంలో లేదా ఆగస్టులో ప్రారంభిస్తాం. ఇది సాధారణ ప్రక్రియ. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు,’’ అన్నారు.

ఇది కూడా చూడండి: Director Sandeep Raj: చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..

పదేండ్లలో చేసిన తప్పులు, దుర్మార్గాలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి.. మేడిగడ్డ, కల్వకుర్తి అంటూ ఇప్పటికీ రైతులను బీఆర్ఎస్ నేతలు మోసం చెయ్యాలని చూస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ అసమర్థత, నిర్లక్ష్యం, నిర్వాకం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని అన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇప్పటికీ ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయని, సీకెంట్​ పైల్స్ టెక్నాలజీతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించడాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తప్పు బట్టిందని చెప్పారు.  ఆ మూడు బ్యారేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని ఎన్డీఎస్ఏ హెచ్చరించింది. అయినా సరే, కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయాలని హరీశ్‌‌‌‌‌‌‌‌రావు పదే పదే మాట్లాడటం వెనుక ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర తప్ప రైతులకు మేలు చేసే మంచితనం లేదు.  

Also Read: నా వద్ద అవి లేవని చెప్పా.. తప్పేముంది: కంగనా రనౌత్

కల్వకుర్తి పంప్‌‌‌‌‌‌‌‌హౌస్ నుంచి నీటిని ఎప్పడు ఎత్తిపోయాలో తమకు తెలుసని, తమకు హరీశ్ నీతులు చెప్పాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ అన్నారు. కల్వకుర్తి పంపులు ఏటా జులై చివరిలో లేదా ఆగస్టు ఒకటో తేదీన స్విచ్​ ఆన్​ చేసి వానాకాలం పంటలకు నీళ్లు అందిస్తారని, ఈసారి కూడా  అదే విధానం అమలవుతుందని స్పష్టం చేశారు.  రైతులు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని సూచించారు.  గత బీఆర్ఎస్ హయాంలో 2019లో ఆగస్టు ఒకటిన,  2020లో ఆగస్టు 31, 2021లో ఆగస్టు 15, 2022లో జులై 13, 2023లో ఆగస్టు 6న కల్వకుర్తి లిఫ్ట్ లు ఆన్​ చేశారని గుర్తు చేశారు. నిరుడు జులై 27న స్విచాన్ ​ చేశామన్నారు. “రైతుల అవసరాలు, నీటి నిల్వల ఆధారంగా సాగునీటి ప్రాజెక్టుల నీటిని ఎప్పుడు విడుదల చేయాలి. ఎంత ఆయకట్టుకు ఇవ్వాలి.. ఈసారి ఎంత సమర్థంగా వాడుకోవాలనేది ప్రభుత్వం తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది. ఈనెల 11న జరిగే  స్టేట్​ లెవల్​ కమిటీ ఫర్​ ఇంటిగ్రేటెడ్ వాటర్​ ప్లానింగ్​ అండ్​ మేనేజ్​మెంట్(ఎస్‌‌‌‌‌‌‌‌సీఐడబ్ల్యూఏఎం ​) మీటింగ్​లో తీసుకునే నిర్ణయాల ఆధారంగా అన్ని సాగునీటి ప్రాజెక్టులు, ఆయకట్టు ప్రణాళిక సిద్ధమవుతుంది” అని  వివరించారు.

Also Read: ఛీ.. ఛీ.. ఇంటర్నెట్‌కు కూడా ఇబ్బందులు.. పాక్ నుంచి పారిపోతున్న కంపెనీలు!

కాగా అంతకు ముందు హరీశ్ రావు మాట్లాడుతూ "శ్రీశైలంలో వరద వచ్చి 36 రోజులు అయ్యింది అబద్దమా? మోటార్లు ఆన్ చేయనిది అబద్దమా? 65 TMC వినియోగించకుండా ఏపీకి నీళ్ళు వదిలింది అబద్దమా? పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి కృష్ణ నీళ్లు తీసుకుపోతుంటే నువ్వు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయకుండా మోసం చేయడం అబద్దమా? కృష్ణా నదిలోనూ ఇదే పరిస్థితి ఉందని, శ్రీశైలం ప్రాజెక్టులో నీటి ప్రవాహం ఉన్నప్పటికీ కల్వకుర్తి మోటార్లు ఇంకా ప్రారంభించలేదని హరీశ్‌రావు తెలిపారు. "ఇది పాలమూరు రైతులపై ఘోరంగా జరుగుతున్న అన్యాయం. గత ప్రభుత్వాలు పట్టించుకోనప్పుడు కేసీఆర్ వచ్చి ప్రాజెక్టు పూర్తి చేశారు. ఇప్పుడు వరద నీరు ఉన్నా, కాంగ్రెస్‌ ప్రభుత్వం చోద్యం చూస్తోంది," అంటూ విమర్శలు గుప్పించారు.

ఇది కూడా చూడండి:IND vs ENG  :  ఆకాష్ దెబ్బ...ఇంగ్లాండ్ అబ్బా :  రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ!

పాలన చేతకాక మోటర్లు ఆన్ చేసి నీళ్ళు ఇవ్వక అబద్దాలు అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. లక్ష క్యూసెక్కులు గోదావరిలో పోతున్నది నిజం కాదా. అని ప్రశ్నించారు. తెలంగాణలో కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని, సాగునీటి కోసం రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. కనీస నీటి మట్టానికి పైగా నీరు ఉన్నా కూడా కన్నెపల్లి పంప్‌హౌస్‌ మోటార్లు ఆన్‌ చేయకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

Also Read : ప్రేమికుల సూసైడ్...పెద్దలు ఒప్పుకోలేదని బ్లేడ్ తో కోసుకుని..

‘‘మేడిగడ్డలో సమస్యలు ఉన్నా, కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ నీటి మట్టం 96 మీటర్లు ఉంది. ఇది మినిమం డ్రాడౌన్ లెవెల్‌ (MDWL) అయిన 93.5 మీటర్ల కంటే రెండున్నర మీటర్లు ఎక్కువ. రోజుకు రెండు టీఎంసీలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం చేతులెత్తేసింది," అని హరీశ్‌రావు ఆరోపించారు."రైతులకు నీళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఎలా నిశ్శబ్దంగా ఉంటోంది? ప్రభుత్వం మోటార్లు ఆన్‌ చేయనట్లయితే, రైతులే ఉద్యమంగా వెళ్లి పంప్‌హౌస్‌ వద్ద మోటార్లు ఆన్‌ చేయాలి. లేకపోతే లక్షల మంది రైతులతో పంప్‌హౌస్‌ వద్దకి వెళ్లి మోటార్లు ఆన్‌ చేస్తాం," అని హెచ్చరించారు.

ఇది కూడా చూడండి:AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో

Advertisment
Advertisment
తాజా కథనాలు