/rtv/media/media_files/2025/07/07/akash-deep-sister-2025-07-07-15-02-52.jpg)
ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. 58 ఏళ్ల చరిత్రలో ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ సాధించిన తొలి టెస్ట్ విజయం ఇదే కావడం విశేషం. శుభమాన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్‌ను 336 పరుగుల తేడాతో ఓడించింది. గిల్, జడేజా, జైస్వాల్, పంత్ కెఎల్ రాహుల్ బ్యాటింగ్‌తో అద్భుతంగా రాణించగా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ బౌలింగ్‌తో మెరిశారు.
ముఖ్యంగా ఇక్కడ మనం ఆకాశ్ దీప్ గురించి మాట్లాడుకోవాలి. రెండో టెస్టులో బుమ్రా ఆడకపోవడంతో అతని స్థానంలో అర్ష్‌దీప్ , కుల్దీప్ యాదవ్‌లను తీసుకోవాలని చాలా మంది మాజీలు సూచించారు. లక్కీగా గంభీర్ సూచనతో ఆకాశ్ దీప్ కు జట్టులో చోటు దక్కింది. వచ్చిన అవకాశాన్ని ఆకాశ్ దీప్ చక్కగా వాడుకున్నాడు. మొత్తం 10 వికెట్లు తీసి ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. దీంతో ఇప్పుడు ఆకాశ్ దీప్ గురించి ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని మాట్లాడుకుంటున్నారు.
Also Read : ఒక్కో అబార్షన్ కు రూ.50 వేలు.. భువనగిరిలో దారుణ దందా.. అడ్డంగా దొరికిన డాక్టర్!
ఏవరీ ఆకాశ్ దీప్ ?
ఆకాష్ దీప్ డిసెంబర్ 15, 1996న బీహార్‌లోని డెహ్రీలో జన్మించాడు. అతని క్రికెట్ ప్రయాణం బీహార్‌లో ప్రారంభమైంది, బీహార్ క్రికెట్ అసోసియేషన్ అతనిపై విధించిన పరిమితుల కారణంగా తన కెరీర్‌ను కొనసాగించడానికి వెస్ట్ బెంగాల్‌కు వెళ్లాడు. 2018-19 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరపున తన T20 అరంగేట్రం చేశాడు.
‘I haven’t told anyone yet. I dedicate this win to my sister, who’s been battling cancer for 2 months. Thankfully, she’s stable now. Every time I held the ball, I pictured her. This performance is for her.’
— 125Manchester (@pantasticxcuts) July 7, 2025
– Akashdeep
The best thing about time is it changes🥹. #AkashDeeppic.twitter.com/IcULgBDVvf
Also Read : ప్రేమికుల సూసైడ్...పెద్దలు ఒప్పుకోలేదని బ్లేడ్ తో కోసుకుని..
Also Read : వామ్మో.. మనిషిని మింగేసిన భారీ కొండచిలువ.. వీడియో వైరల్
రంజీ ట్రోఫీతో సహా అన్ని ఫార్మాట్లలో బెంగాల్ తరపున చక్కటి ప్రదర్శన ఇచ్చాడు, అతని బౌలింగ్ రెండుసార్లు జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించింది. 2024 సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి మూడు టెస్టులకు ఆకాష్ దీప్ తన తొలి టెస్ట్ కాల్-అప్‌ను అందుకున్నాడు. ఫిబ్రవరి 23, 2024న రాంచీలో తన టెస్ట్ అరంగేట్రం చేసాడు, మొదటి ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్ వికెట్లతో సహా మూడు వికెట్లు పడగొట్టాడు.
ఆకాష్ దీప్ తండ్రి పక్షవాతం బారిన పడి చనిపోయాడు. అతని తండ్రి మరణం తర్వాత సోదరుడు కూడా మరణించాడు. దీంతో క్రికెట్ కు మూడు సంవత్సరాల విరామం తీసుకున్న ఆకాష్.. మళ్లీ ఫోకస్ పెట్టి జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. అతని సోదరి ప్రస్తుతం క్యాన్సర్ బారిన పడింది. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తు్న్నారు. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో తన ఆటతీరును తన సోదరికి అంకితం చేశాడు అకాష్. మ్యాచ్ కు రెండు నెలల ముందే తన సోదరికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపాడు.
Also Read : తెలంగాణ ICET ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో చెక్ చేసుకోండిలా?
Akash Deep sister | sports | cricket | ind-vs-eng | Akash Deep