Road Accident: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. భార్యాభర్తలను బలి తీసుకున్న లారీ!

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్ దగ్గర భార్యాభర్తలు రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టింది. స్పాట్‌లోనే భార్యాభర్తలు మృతి చెందారు. అయితే తూప్రాన్‌పేట్‌కు చెందిన వెంకటేష్, లక్షీగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
Accident

Accident

ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. డ్రైవింగ్ చేసే వారు సరిగ్గా చేయడం లేదు. చుట్టూ చూడకుండా వేగంగా నడుపుతున్నారు. అలాగే రోడ్డు దాటే వారు కూడా మొబైల్ చూస్తూ దాటుతున్నారు. ఇలాంటి సమయంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్ దగ్గర భార్యాభర్తలు రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టింది. స్పాట్‌లోనే భార్యాభర్తలు మృతి చెందారు. అయితే తూప్రాన్‌పేట్‌కు చెందిన వెంకటేష్, లక్షీగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇది కూడా చూడండి: Director Sandeep Raj: చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..

ఇటీవల హైదరాబాద్‌లో.. 

ఇదిలా ఉండగా ఇటీవల వికారాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సర్పన్‌పల్లి ప్రాజెక్టులో పర్యాటకుల బోటు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బోటులో నలుగురు పర్యటకులు ఉన్నారు. వారిలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. 

ఇది కూడా చూడండి:Eggs: గుడ్లు ఎవరు తినొద్దు ఎప్పుడు తినొద్దు? తింటే కలిగే చెడు ప్రభావాల గురించి ఇప్పుడే తెలుసుకోండి

హైదరాబాద్‌కు చెందిన ఫ్యామిలీ ప్రాజెక్టు సమీపంలోని రిసార్ట్‌కు టూర్‌కు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నలుగురు పడవలో ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో రితిక (44), పూనమ్‌(50) మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇది కూడా చూడండి:AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో

ప్రభుత్వ అనుమతులు లేకుండా బోట్లు నడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అనేక ఘటనలు జరిగినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాధిత కుటుంబం బిహార్‌ నుంచి వచ్చి హైదరాబాద్‌లోని మియాపుర్‌లో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు