/rtv/media/media_files/2025/07/07/vanmahotsavam-2025-07-07-09-57-28.jpg)
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వనమహోత్సవంలో రుద్రాక్ష మొక్కను నాటారు. వనమహోత్సవం 2025ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ ఏడాది రాష్ట్రంలో 18.02 కోట్ల మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్ఫష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ యూనివర్సిటీలో ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.
రుద్రాక్ష మొక్క నాటిన సీఎం రేవంత్ రెడ్డి
— Volganews (@Volganews163907) July 7, 2025
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్క నాటిన సీఎం#revanthreddypic.twitter.com/jHnyadEWED
వనమే మనం… మనమే వనం అని పెద్దలు చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని సీఎం అన్నారు. ప్రతీ ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. హైటెక్ సిటీలో విప్రో, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఉండేచోట మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కల్పించామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్ రాబోతోందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమెల్యే సీట్లు ఇచ్చేబాధ్యత తాను తీసుకున్నట్లు రేవంత్ రెడ్డి అన్నారు.