Bus Overturns: ప్రయాణికుల బస్సు బోల్తా.. 10 మంది స్పాట్ డెడ్ - మరో 24 మంది

పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. దసూహా-హాజీపూర్ రోడ్డులో బస్సు బోల్తా పడటంతో 10 మంది దుర్మరణం చెందారు. మరో 24 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

New Update
Punjab Hoshiarpur bus overturning

Punjab Hoshiarpur bus overturning

పంజాబ్‌లోని హోషియార్‌పూర్ పరిధిలోని దాసుహాలో విషాదకర ఘటన జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. మరో 24 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్సు అదుపు తప్పి దాసుహా హాజీపూర్ రోడ్డు సమీపంలోని సాగర అడ్డా సమీపంలో బోల్తా పడింది. గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Hoshiarpur bus overturning

పోలీసుల ప్రకారం.. దసూహా-హాజీపూర్ రోడ్డులోని సగ్రా అడ్డా సమీపంలో ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు నిర్ధారించబడినప్పటికీ, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా నివేదించింది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు