/rtv/media/media_files/2025/07/07/trump-tariffs-2025-07-07-09-10-47.jpg)
trump tariffs
Trump Tariffs: భారత్ తో సహా పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలను విధించారు. కెనడా, చైనాలపై అన్నిటి కంటే ఎక్కువ టారీఫ్ లను విధించారు. కానీ మిగతా దేశాలకు మాత్రం 26 శాతం సుంకాలను వేస్తామని చెప్పారు. దీంతో చాలా పెద్ద గొడవ జరిగింది. భారత్ తో సహా అన్ని దేశాలు ఈ ప్రతీకార సుంకాలను ఒప్పుకోలేదు. చైనా అయితే తిరిగి అంతే సుంకాలను విధించింది. దీంతో వాణిజ్య యుద్ధానికి తెర లేచింది. ఇది సద్దు మణగడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుకాలకు బ్రేక్ ఇచ్చారు. 90 రోజుల పాటూ వాటికి నిలిపివేస్తున్నట్టు చెప్పారు.
Also Read: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో
ఆగస్టు 1 నుంచి అమల్లోకి..
అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన 90 రోజుల బ్రేక్ ప్రకారం దీని డెడ్ లైన్ జూలై 9 అవుతుంది. దీని బట్టి మరో రెండు రోజుల్లో సుంకాల మోత మోగాలి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ డెడ్ లైన్ ను మరోసారి పొడగించినట్టు తెలుస్తోంది. కొత్త టారీఫ్ లను ఆగస్టు 1 నుంచి అమలు చేస్తారని చెబుతున్నారు. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ప్రస్తుతం అధ్యక్షుడు వాణిజ్య ఒప్పందాలను నిర్ణయించే పనిలో నిమగ్నమై ఉన్నారని..అందుకే కొత్త టారిఫ్‌లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయని ఆయన తెలిపారు.
Also Read: Ind-Eng: ఇంగ్లాండ్-ఇండియా రెండో టెస్ట్ లో నమోదైన రికార్డ్ లు..