🔴Operation Sindoor Live Updates: ఇండియా - పాకిస్తాన్ వార్ : లైవ్

పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది.. పాక్‌, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి మెరుపుదాడి చేసింది. దాయాదిపై భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్యలో ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు పాల్గొన్నాయి.

author-image
By Lok Prakash
New Update
India Pakistan WAR

India Pakistan WAR

🔴Operation Sindoor Live Updates:

Operation Sindoor: 100 మంది ఉగ్రవాదులను లేపేసాం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా కనీసం 100 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు.

At least 100 terrorists killed in Indian strikes in Pakistan, Says Rajnath Singh
At least 100 terrorists killed in Indian strikes in Pakistan, Says Rajnath Singh

పహల్గాం ఉగ్రదాడికి(Pahalgam Terror Attack) ప్రతీకారంగా భారత సైన్యం(Indian Army) ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పేరిట పాకిస్థాన్‌లోని(Pakistan) ఉగ్రస్థావరాలపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. 9 ప్రాంతాల్లోని ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ విజయవంతంగా మెరుపు దాడులు చేసింది. అయితే ఈ దాడుల్లో ఎంతమంది చనిపోయారనేది ఇప్పటిదాకా స్పష్టంగా తెలియలేదు. దీనిపై తాజాగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా కనీసం 100 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌ వివరాలను గురువారం ఆయన అఖిపక్ష భేటీలో తెలియజేశారు. ఈ ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. 

Also Read: operation Sindoor: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!

Also Read: ఏవోబీలో భారీ ఎన్‌కౌంటర్‌.. అగ్రనేతలు మృతి.. ఫైరింగ్ వీడియో వైరల్!

మరోవైపు ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అవ్వడంతో దేశవ్యాప్తంగా ప్రజలు భారత ఆర్మీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బుధవారం దీనిపై స్పందించిన రాజ్‌నాథ్‌ సింగ్.. శత్రువులకు గట్టిగా బుద్ధి చెప్పామన్నారు. ''ప్రధాని నేతృత్వంలో దేశ శత్రువులకు తగిన సమాధానం చెప్పాం. భారత సైన్యం తన సత్తాను చాటింది. అమాయకుల ప్రాణాలు తీసినవాళ్లు మూల్యం చెల్లించారు. పౌరుల ప్రాణాలకు నష్టం కలిగించకుండా దాడులు నిర్వహించాం. రైట్‌ టు రెస్పాండ్ హక్కును వాడుకున్నాం. అమాయకులను చంపినవాళ్లనే హతం చేశాం. హనుమంతుడినే ఆదర్శంగా తీసుకున్నాం. దేశ భద్రతకు భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని'' రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 

Also Read: కల్నల్ సోఫియా ఖురేషి తండ్రి ఊర మాస్.. తండ్రికి తగ్గ కూతురే..!

ఇదిలాఉండగా భారత్‌లో చొరబాటుకు యత్నించిన ఓ పాకిస్థాన్ వ్యక్తిని బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కాల్చి చంపేశారు. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. మే 07వ తేదీ బుధవారం అర్ధరాత్రి సమయంలో ఫిరోజ్‌పూర్‌ సెక్టార్‌లో పాకిస్థాన్ వ్యక్తి చొరబాటుకు యత్నించించాడు. చీకటినిఆసరాగా చేసుకుని బార్డర్ దాటలని ప్రయత్నించడాన్ని గమనించిన  బీఎస్‌ఎఫ్‌ కాల్పులు జరిపారు. మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు.

  • May 08, 2025 22:29 IST

    BIG BREAKING: పాకిస్థాన్‌పై దాడులు మొదలుపెట్టిన భారత్..

    పాకిస్థాన్‌పై భారత్ ప్రతిదాడులకు దిగింది. లాహోర్, సియాల్‌ కోట్‌పై భారత సైన్యం దాడులకు దిగింది. 

    India Pak War BIG Updates🔴LIVE :ఇండియా - పాకిస్తాన్ యుద్ధం| Jammu Attack | Operation Sindoor | RTV



  • May 08, 2025 21:56 IST

    BIG BREAKING: పాక్ F16, F17 ఫైటర్ జెట్లను కూల్చేసిన ఇండియన్ ఆర్మీ

    జమ్మూలో పాకిస్థాన్‌ 8 మిసైల్స్‌,10 డ్రోన్లతో దాడులకు యత్నించింది. ఒక F16, రెండు F17 ఫైటర్ జెట్లను కూడా ప్రయోగించింది. వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ మిసైల్స్‌, డ్రోన్లను కూల్చివేసింది. అలాగే F16, రెండు F17 యుద్ధ విమానాలకు కూడా నేలమట్టం చేసింది.

    Pakistan Attack on Jammu Airport
    Pakistan Attack on Jammu Airport

     



  • May 08, 2025 21:56 IST

    Jammu Airport Attack - S 400: పాక్ జెట్ లను తుక్కు తుక్కు చేస్తున్న భారత్ ఫైటర్ జెట్లు..

    జమ్మూలోని ఎయిర్‌పోర్టుపై పాకిస్తాన్ దాడి చేసింది. భారతఆర్మీ S-400 సాయంతో 8 పాక్ క్షిపణులను గాల్లోనే ధ్వంసం చేసింది. పాక్‌కు చెందిన F-16 ఫైటర్ జెట్, రెండు JF17 యుద్ధ విమానాలను కూల్చేసింది. భారత ఫైటర్ జెట్లు జమ్మూలోని పఠాన్ కోట్ నుంచి బయలుదేరాయి.

    Jammu Airport Attack



  • May 08, 2025 21:55 IST

    Jammu Airport Attack: జమ్మూ లో దుమ్ము దులుపుతున్న భారత్ ఆర్మీ.. 8 మిస్సైళ్లను పేల్చేసిన S- 400

    జమ్ము సివిల్ ఎయిర్‌పోర్ట్, సాంబ, ఆర్ఎస్‌పుర, అర్నియా, ప్రాంతాల్లో 8 మిసైల్స్, డ్రోన్లతో దాడులకు పాకిస్థాన్ యత్నించింది. వెంటనే స్పందించిన భారత ఆర్మీ S-400, ఆకాష్ ఎయిర్‌ సిస్టమ్‌తో ఈ మిసైల్స్, డ్రోన్లను కూల్చివేసింది.

    S- 400
    S- 400

     



  • May 08, 2025 21:55 IST

    Jammu AirPort Attack:



  • May 08, 2025 21:12 IST

    Jammu AirPort Attack: మేము దాడి చేస్తే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తాం: పాక్ ఆర్మీ



  • May 08, 2025 20:57 IST

    BIG BREAKING: జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై పాకిస్థాన్‌ దాడులు

    జమ్మూకశ్మీర్‌లో చీకట్లు కమ్ముకున్నాయి. జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై పాకిస్థాన్‌ రాకెడ్‌ దాడి చేసింది. దీంతో ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని భారత సైన్యం హెచ్చరించింది. 

    Pakistan Attack on Jammu Airport
    Pakistan Attack on Jammu Airport

     



  • May 08, 2025 20:51 IST

    BIG BREAKING: జమ్మూలో భారీ పేలుళ్లు.. నగరం మొత్తం బ్లాక్ అవుట్



  • May 08, 2025 20:17 IST

    Vikram Misri: పాక్ చీకటి రహస్యాలు చెప్పిన విక్రమ్ మిస్రీ ఎవరో తెలుసా ?

    ఆపరేషన్ సిందూర్ గురించి మీడియా సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పాక్ చీకటి రహస్యాలు వివరించారు. ఈయన కశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని ఓ పండిట్ కుటుంబలో జన్మించారు. విక్రమ్ మిస్రీ గురించి పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

    Foreign secretary of india vikram misri life story
    Foreign secretary of india vikram misri life story

     



  • May 08, 2025 19:00 IST

    Reliance: పొరపాటు జరిగింది.. 'ఆపరేషన్ సిందూర్' ట్రేడ్‌మార్క్‌పై క్లారిటీ ఇచ్చిన రిలయన్స్

    ఆపరేషన్ సిందూర్ పేరును ట్రేడ్‌మార్క్ చేసుకోవాలన్న యత్నాలపై రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెనక్కి తగ్గంది. తమ సంస్థలో ఓ జూనియర్ ఉద్యోగి పర్మిషన్ తీసుకోకుండానే ఈ దరఖాస్తు చేశాడని స్పష్టం చేసింది. అయినప్పటికీ దాన్ని తాము ఉపసంహరించుకున్నట్లు పేర్కొంది.

    Reliance withdraws 'Operation Sindoor' trademark, says it was filed inadvertently
    Reliance withdraws 'Operation Sindoor' trademark, says it was filed inadvertently

     



  • May 08, 2025 18:54 IST

    Revanth Reddy: ఆపరేషన్ సింధూర్ రేవంత్ ర్యాలీ



  • May 08, 2025 18:51 IST

    BIG BREAKING: 13 మంది పౌరులు మృతి



  • May 08, 2025 18:49 IST

    Nara Lokesh: నారా లోకేష్ పిలుపు



  • May 08, 2025 18:24 IST

    Operation Sindoor : పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్.. వాటిపై నిషేదం

    పాకిస్థాన్‌కు బిగ్‌షాక్ తగిలింది. పాక్ రూపొందిన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు వెంటనే తొలగించాలని భారతప్రభుత్వం అన్ని OTTసంస్థలు, డిజిటల్ స్ట్రీమింగ్ సేవలు, ఆన్‌లైన్ మధ్యవర్తులను ఆదేశించింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. 

    India govt Bans Pakistani Content on OTT Platforms Amid Terror Concerns



  • May 08, 2025 18:23 IST

    ఆపరేషన్‌ సిందూర్‌ వెనుక ఉన్నది వీరే.. NTRO గురించి తెలిస్తే షాక్!

    నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తోనే ఆపరేషన్ సిందూర్‌ విజయవంతమైంది. ఎన్నో ఆపరేషన్లకు ఈ నిఘా సంస్థ కీలక పాత్ర పోషించింది. ఇది శాటిలైట్, ఇంటర్నెట్‌ నిఘా వంటి అధునాతన సాంకేతిక నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

    National Technical Research Organization



  • May 08, 2025 18:23 IST

    BIG BREAKING: పాక్ దాడులను తిప్పికొట్టాం.. కల్నల్ సోఫియా ఖురేషీ సంచలన వ్యాఖ్యలు

    ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి మరో కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సిందూర్‌ కొనసాగుతోందని.. తాము పాకిస్థాన్ ప్రజలను లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొన్నారు. పాక్‌ క్షిపణులను భారత సైన్యం తిప్పికొట్టిందని స్పష్టం చేశారు.

    Operations Sindoor 2.0 Live Updates



  • May 08, 2025 18:22 IST

    Operation Sindoor: కాపాడండి.. పాక్ ఎంపీ కన్నీళ్లు-VIDEO VIRAL

    ఆపరేషన్ సిందూర్ తో పాక్ వణికిపోతోంది. తాజాగా ఆ దేశ ఎంపీ నేషనల్ అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత్‌ నుంచి రక్షించాలంటూ ఆ ఎంపీ వేడుకున్నారు. అల్లాయే కాపాడాలంటూ ప్రార్థించారు.

    Pakisthan MP Operation Sindoor
    Pakisthan MP Operation Sindoor

     



  • May 08, 2025 18:05 IST

    Operation Sindoor



  • May 08, 2025 18:04 IST

    Operation Sindoor



  • May 08, 2025 17:28 IST

    Operation Sindoor



  • May 08, 2025 17:27 IST

    Chenab River: జమ్మూకశ్మీర్‌లో వరదలు.. బాగ్లిహర్, సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తివేత

    జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతంలో వరదలు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహర్ డ్యామ్, అలాగే సలాల్ డ్యామ్ గేట్లను అధికారులు తెరిచారు. ఇటీవలే సింధూ నది ఒప్పందం నిలిపివేయండంతో ఆ డ్యామ్ గేట్లను మూసేశారు.

    India Opens Baglihar Dam and Salal Dam Gates in Ramban Region Of Jammu and Kashmir On Chenab River
    India Opens Baglihar Dam and Salal Dam Gates in Ramban Region Of Jammu and Kashmir On Chenab River

     



  • May 08, 2025 17:26 IST

    Drone Attack: బిగ్ షాక్.. క్రికెట్ స్టేడియంపై డ్రోన్ దాడి - ఇద్దరు స్పాట్‌లోనే!

    పాకిస్తాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో భారత డ్రోన్ కూలిపోయింది. పాకిస్తాన్ సూపర్ లీగ్‌ (PSL 2025)లో భాగంగా ఇవాళ పెషావర్ జల్మి VS కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు ఈ సంఘటన జరిగింది. ఆ వీడియో వైరలవుతోంది.

    Rawalpindi cricket stadium damaged ahead of PSL match
    Rawalpindi cricket stadium damaged ahead of PSL match

     



  • May 08, 2025 17:26 IST

    పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన రష్యా S-400.. ఎలా పని చేస్తోందో తెలుసా?

    పాక్ క్షిపణులు, డ్రోన్లతో గురువారం భారత్‌పై దాడికి యత్నించింది. వాటిని ఇండియా ఎయిర్ డిఫెన్స్ S-400తో అడ్డుకుంది. గాల్లోనే వాటిని ధ్వంసం చేసింది. ఇండియాలో ఉన్న మూడు S-400లను సుదర్శన్ చక్రం అని పేరు. 400KM పరిధిలో ఏ మిస్సైల్ ఎగిరినా ఇది పేల్చేస్తోంది.

    S 400 sudharshan



  • May 08, 2025 17:25 IST

    India-Pakistan Row: పాకిస్థాన్‌కు మరో షాక్.. భారత్‌కు ముస్లిం దేశాలు క్యూ

    సౌదీ అరేబియా విదేశాంగశాఖ సహాయమంత్రి అదెల్ అల్‌ జుబేర్‌ గురువారం ఉదయం భారత్‌కు వచ్చారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ను ఆయన కలిశారు. బుధవారం అర్ధరాత్రి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి కూడా ఢిల్లీకి చేరుకున్నారు.

    Saudi minister makes unannounced Delhi visit amid India-Pakistan tensions
    Saudi minister makes unannounced Delhi visit amid India-Pakistan tensions

     



  • May 08, 2025 16:49 IST

    పీఎం మోదీతో అజిత్ దోవల్ భేటీ!



  • May 08, 2025 16:44 IST

    Operations Sindoor: గగన్‌యాన్‌ వ్యోమగామికి వాయుసేన పిలుపు.. యుద్ధ విమానాలు సిద్ధం!

    పాక్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత వాయుసేన సంచలన నిర్ణయం తీసుకుంది. అంతరిక్ష యాత్ర వెళ్లేందుకు శిక్షణ తీసుకుంటున్న గగన్‌యాన్‌ వ్యోమగామి అజిత్ కృష్ణన్‌ను వెనక్కి పిలిపించింది. యద్ధ విమానాలు నడపడంలో అజిత్ కు చాలా అనుభవం ఉంది.

    gaganyan
    gaganyan Photograph: (gaganyan)

     



  • May 08, 2025 16:43 IST

    చౌకిబాల్ టౌన్ లో పాకిస్తాన్ నుంచి వచ్చిన మోర్టార్ కారణంగా పడిన గుంత



  • May 08, 2025 16:32 IST

    పాకిస్తాన్ పార్లమెంట్ లో కన్నీరు పెట్టుకుంటున్న ఎంపీ



  • May 08, 2025 15:54 IST

    Operation Sindoor: లాహోర్ పై భారత్ డ్రోన్ అటాక్



  • May 08, 2025 15:49 IST

    Operation Sindoor: పాక్ దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన ఇండియా.. క్షిపణులు, డ్రోన్లు గాల్లోనే ముక్కలు

    పాకిస్తాన్ గురువారం రాత్రి ఇండియాలో 15 ప్రాంతాలపై దాడులు చేసింది. పాక్ క్షిపణులు, డ్రోన్లను ఇండియా ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎఎస్ గ్రిడ్ మరియు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు అడ్డుకున్నాయి. ఈ విషయాన్ని కేంద్రం అధికారికంగా ప్రకటించింది.

    Pakistani drones, missiles



  • May 08, 2025 15:47 IST

    BIG BREAKING: పాక్ పై మళ్లీ దాడికి దిగిన ఇండియా.. ఆ 9 నగరాలపై ఎటాక్!

    పాకిస్థాన్‌పై ఇండియన్ ఆర్మీ మళ్లీ దాడులకు దిగింది. లాహోర్, కరాచీ, రావల్పిండి సహా 9 నగరాలపై డ్రోన్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లో పాక్‌ వైమానిక రక్షణ వ్యవస్థలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది.

    BREAKING NEWS
    breaking news

     



  • May 08, 2025 15:46 IST

    Airports Closed In India: హై అలర్ట్.. 27 ఎయిర్‌పోర్టులు, 430 విమానాలు క్యాన్సిల్

    ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌లో పలు విమానాశ్రయాలు మూసివేశారు. మరిన్ని విమానాలు రద్దు చేశారు. సుమారు 27 ఏయిర్ పోర్ట్‌లను మూసివేయగా.. మొత్తం 430 విమానాలను భారత విమానయాన సంస్థలు రద్దు చేశాయి. ఈ విమానాశ్రయాలను మే 10 (శనివారం) వరకు మూసివేశారు.

    airports closed in india (1)



  • May 08, 2025 15:16 IST

    Operations Sindoor: 15 నిమిషాలు పవర్ ఇవ్వండి.. పాక్ ను నాశనం చేస్తాం.. MIM సంచలన ప్రకటన!

    ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఢిల్లీ MIM నేత షోయబ్ జమాయ్ సంచలన ప్రకటన చేశారు. భారత ముస్లింలకు 15 నిమిషాలు పవర్ ఇస్తే పాకిస్తాన్‌ను నాశనం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం తమకు అధికారం అప్పగిస్తే పాక్‌ను ఎలా నాశనం చేయాలో తాము చెబుతామన్నారు. 

    pak mim
    pak mim Photograph: (pak mim)

     



  • May 08, 2025 15:09 IST

    Operation Sindoor : కుక్క చావు చచ్చిన టెర్రరిస్ట్.. అన్నని విడిపించడానికి ఇండియా ఫ్లైట్ హైజాక్

    1999లో ఇండియా విమానాన్ని హైజాక్‌ చేసి కాందహార్ తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధాన సూత్రదారి జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్. ఇతను కూడా ఆపరేషన్ సిందూర్‌లో చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు.

    Abdul Rauf Azhar



  • May 08, 2025 15:09 IST

    Operation Sindoor: పాకిస్తాన్‌తో యుద్దం.. అన్ని పాఠశాలలు బంద్

    ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సరిహద్దు ప్రాంతాలైన పంజాబ్, రాజస్థాన్‌‌లో హై అలెర్ట్ జారీ అయింది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని పోలీసు సిబ్బంది సెలవులను అధికారులు రద్దు చేశారు. అలాగే ముందు జాగ్రత్తగా ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పాఠశాలలు మూతపడ్డాయి.

    operation sindoor punjab and rajasthan on high alert (1)



  • May 08, 2025 15:08 IST

    Amit Shah: 'జాగ్రత్త.. సోషల్ మీడియాపై నిఘా'.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశం

    కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు కీలక సూచనలు చేసింది. సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘా ఉంచాలని తెలిపింది. ఆపరేషన్ సిందూర్‌పై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే ఆ అకౌంట్లు బ్లాక్‌ చేయాలని ఆదేశించింది.

    Amit Shah asks All States and Union Territories to maintain strict vigil against anti-national propaganda on social media
    Amit Shah asks All States and Union Territories to maintain strict vigil against anti-national propaganda on social media

     



  • May 08, 2025 13:55 IST

    100 మంది ఉగ్రవాదులను లేపేసాం: రాజ్‌నాథ్ సింగ్

    ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా కనీసం 100 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు.

    At least 100 terrorists killed in Indian strikes in Pakistan, Says Rajnath Singh
    At least 100 terrorists killed in Indian strikes in Pakistan, Says Rajnath Singh

     



  • May 08, 2025 13:39 IST

    ఆపరేషన్ సింధూర్.. మొత్తం 100 మంది టెర్రరిస్టులు మృతి: మంత్రి రాజ్ నాధ్ సింగ్



  • May 08, 2025 13:36 IST

    ఆపరేషన్ సిందూర్ ఇంకా ఉంది.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

    ఆపరేషన్ సిందూర్‌పై ఆల్ పార్టీ మీటింగ్ అనంతరం కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తి కాలేదన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్ వివరాలు ఇవ్వలేమని ఆయన అన్నారు. 

    V BREAKING



  • May 08, 2025 13:24 IST

    భారత్ లోకి చొరబాటుకు పాక్ వ్యక్తి యత్నం.. లేపేసిన బీఎస్ఎఫ్!

    భారత్‌లో చొరబాటుకు యత్నించిన ఓ పాకిస్థాన్ వ్యక్తిని బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కాల్చి చంపేశారు. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. చీకటిని ఆసరాగా చేసుకుని బార్డర్ దాటలని ప్రయత్నించడాన్ని గమనించిన  బీఎస్‌ఎఫ్‌ కాల్పులు జరిపారు.

    punjab border
    punjab border

     



  • May 08, 2025 13:07 IST

    Operation Sindhoor: కల్నల్ సోఫియా ఖురేషి తండ్రి ఊర మాస్.. తండ్రికి తగ్గ కూతురే..!

    కల్నల్ సోఫియా ఖురేషి సాధించిన ఘనతకి ఆమె తండ్రి తాజ్ మొహమ్మద్ గర్వపడుతున్నాని అన్నారు. ఆయన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. తాజ్ మొహమ్మద్ 1971 యుద్ధంలో పాల్గొన్నారు. ఆయనకు అవకాశం వస్తే ఇప్పుడైనా పాకిస్తాన్‌తో యుద్ధం చేస్తానని మీడియాతో అన్నారు.

    Colonel Sofia Qureshi



  • May 08, 2025 12:58 IST

    Operation Sindoor: అక్కడ కనిపిస్తే కాల్చివేయండి.. భారత్ ఆర్మీకి సంచలన ఆదేశాలు!

    భద్రతా దృష్ట్యా రాజస్థాన్‌లో 1037 కిలోమీటర్లు వరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేశారు. సరిహద్దుల్లో ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే కాల్చివేయాలని ప్రభుత్వం ఇండియన్ ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే పంజాబ్‌లోని ఆరు ప్రాంతాల్లోని పాఠశాలలను క్లోజ్ చేశారు.

     



  • May 08, 2025 12:57 IST

    పాక్‌కు మరో దెబ్బ.. 14 మంది సైనికులు హతం.. లైవ్ వీడియో!

    బలూచిస్తాన్ ఆర్మీ పాక్‌పై ఎటాక్ చేసింది. ఇందులో 14 మంది సైనికులు మృతి చెందినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. ఆర్మీ వాహనంపై రిమోట్ కంట్రోల్ తో IED బాంబు‌ను అమర్చి పేల్చి దాడి చేశారు.

    Read More

     



  • May 08, 2025 12:31 IST

    పాకిస్తాన్ మిస్సైల్‌ను గాల్లోనే పేల్చేసిన భారత్

    ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా పాకిస్తాన్ ఇండియాపైకి మిస్సైల్ దాడికి దిగింది. రాత్రి పంజాబ్‌లో అమృత్‌సర్ వద్ద క్షిపణితో అటాక్ చేసేందుకు పాక్ ప్రయత్నించింది. భారత్ యాంటి మిస్సైల్ వ్యవస్థ పాకిస్తాన్ మిస్సేల్‌ని గాల్లోనే ధ్వంసం చేసింది.

    Pakistani missile



  • May 08, 2025 12:18 IST

    ఆపరేషన్ సిందూర్.. అఖిలపక్ష భేటీలో మోదీ కీలక ప్రకటన

    ఆపరేషన్ సిందూర్ తర్వాత కేంద్రం నేడు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశమంతా కూడా ఐక్యంగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి జేపీ నడ్డా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.

    Pm Modi meeting
    Pm Modi meeting

     



  • May 08, 2025 11:59 IST

    KA Paul : రంగంలోకి కేఏ పాల్... పాకిస్తాన్‌తో చర్చలు.. యుద్ధం వద్దంటూ..!

    రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇండియా, పాకిస్తాన్ మధ్య చర్చలు జరుపుతున్నట్లుగా ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. మే10వ తేదీ శనివారం ప్రధాని మోదీ, అమిత్ షాలను కలుస్తున్నానని, ఆదివారం పాకిస్తాన్ కు కూడా వెళ్తానని వెల్లడించారు.

    ka-paul pakistan
    ka-paul pakistan

     



  • May 08, 2025 11:39 IST

    పాకిస్తాన్ కొంపముంచిన చైనా.. పాక్ సరిహద్దులో డ్రాగెన్ సరుకు ఫెయిల్

    ఆపరేషన్ సిందూర్‌ని పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకోలేక పోయింది. ఇప్పుడే కాదు గతంలో కూడా భారత్, అమెరికా దాడి చేసినప్పుడు పాక్ ఉపయోగించే చైనా నిఘూ వ్యవస్థ ఫైయిల్ అయ్యింది. భారత క్షిపణులు, డ్రోన్లు పీవోకేలోకి ప్రవేశించినా పాక్‌ కనిపెట్టలేకపోయింది.

    India Pakistan Conflict



  • May 08, 2025 11:01 IST

    పాక్‌ ఆర్మీ కాల్పులు.. భారత జవాన్ వీరమరణం

    ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడింది. విచక్షణారహితంగా కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్‌ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై పాక్‌ కాల్పులు చేపట్టింది. ఈ కాల్పుల్లో భారత జవాన్ దినేశ్‌కుమార్‌ వీరమరణం పొందారు.

    Soldier Dinesh Kumar Sharma
    Soldier Dinesh Kumar Sharma

     



  • May 08, 2025 11:00 IST

    Operation sindoor : హ్యాట్సాఫ్.. ఇది కదా దేశభక్తి అంటే.. ఆడపిల్ల పుట్టినందుకు..!

    ఆపరేషన్ సిందూర్ పట్ల దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ దేశభక్తి భావనతో ప్రేరణ పొంది బీహార్ రాష్ట్రంలోని కతిహార్ జిల్లాలో బాలతి మహేశ్‌పూర్ నివాసితులైన సంతోష్ మండల్, రాఖీ కుమారి తమ నవజాత కుమార్తెకు "సిందూరి" అని పేరు పెట్టారు.

    sindoori
    sindoori

     



  • May 08, 2025 09:53 IST

    ఆపరేషన్ సింధూర్ లో కశ్మీర్ ముస్లిం కీలక పాత్ర!

    పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ బుధవారం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌లో అనంత్‌నాగ్‌కు చెందిన కాశ్మీరీ ముస్లిం ఎయిర్ వైస్ చీఫ్ మార్షల్ హిలాల్ అహ్మద్ చాలా ముఖ్యమైన పాత్ర  పోషించినట్లు సమాచారం.

    operations-sindoor
    operations-sindoor

     



Advertisment
Advertisment
తాజా కథనాలు