Operation Sindoor: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!

ఆపరేషన్ సిందూర్ వేళ దేశంలో ఉద్రక్తిపరిస్థితులు నెలకొన్నాయి. మీ ఇంటిని పేల్చేస్తాం అంటూ ఏపీ తిరుపతి వాసికి పాకిస్తాన్ నుంచి ఫోన్ కాల్స్ రావడం కలకలం రేపింది. వెంటనే త్రిలోక్ కుమార్ ఫిర్యాదు చేయగా నంబర్ ట్రేస్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

New Update

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ వేళ ఉద్రక్తిపరిస్థితులు నెలకొన్నాయి. మీ ఇంటిని పేల్చేస్తాం అంటూ ఏపీ తిరుపతి వాసికి పాకిస్తాన్ నుంచి ఫోన్ కాల్స్ రావడం కలకలం రేపింది. వెంటనే త్రిలోక్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నంబర్ ట్రేస్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ మేరకు భారత్.. పాక్ లోని ఉగ్రస్థావరాలపై  దాడులు చేసిన విషయం తెలిసిందే. కాగా దేశవ్యాప్తంగా హై అలర్ట్ నడుతస్తోంది. ఈ క్రమంలోనే తిరుపతివాసి త్రిలోక్ కు థ్రెటెన్ కాల్ రావడం సంచలనం రేపుతోంది. త్రిలోక్ వెంటనే అప్రమత్తమై పోలీసులను ఆశ్రయించగా ట్రూ కాలర్ ఆధారంగా ఆ నెంబర్ పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. 

Also Read: 11, 12, 14 ఈ నెంబర్లకు ఆపరేషన్ సిందూర్‌కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

అలాగే ఆపరేషన్ సిందూర్‎పై ఉగ్రవాద దాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ స్పందించారు. 'నా భర్తను విడిచిపెట్టమని వేడుకున్నా వదల్లేదు. ఇప్పుడు నా బాధ ఎలా ఉంటుందో వారికి తెలిసింది' అంటూ ఎమోషనల్ అయ్యారు. 
ఈ మేరకు హిమాన్షి నర్వాల్ మాట్లాడుతూ.. ఇది 26 మంది మృతుల కుటుంబాల బాధకు దక్కిన గౌరవం అన్నారు. మోదీ ప్రభుత్వం, భారత దళాలు ఉగ్రవాదులకు, వారి నిర్వాహకులకు ఆపరేషనన్ సిందూర్ ద్వారా బలమైన సందేశాన్ని ఇచ్చాయని కొనియాడారు. 26 మంది మృతుల కుటుంబాల బాధ ఇప్పుడు సరిహద్దు అవతల ఉన్నవారికి తెలిసిందన్నారు. 'ఆ రోజు నా భర్తను విడిచిపెట్టమని వేడుకున్నా. మాకు పెళ్లై ఆరు రోజులే అయిందని బతిమాలాను. కరుణించమని అడిగినా మోదీని అడగండి అంటూ చంపేశారు. ఈ రోజు మోదీ జీ, మన సైన్యం బలమైన సమాధానం చెప్పారు' అంటూ హిమాన్షి కన్నీరుపెట్టుకున్నారు. 

Also Read: Operation Sindoor : పాక్‌పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ

tirupathi | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు