Jammu Airport Attack: జమ్మూ లో దుమ్ము దులుపుతున్న భారత్ ఆర్మీ.. 8 మిస్సైళ్లను పేల్చేసిన S- 400

జమ్ము సివిల్ ఎయిర్‌పోర్ట్, సాంబ, ఆర్ఎస్‌పుర, అర్నియా, ప్రాంతాల్లో 8 మిసైల్స్, డ్రోన్లతో దాడులకు పాకిస్థాన్ యత్నించింది. వెంటనే స్పందించిన భారత ఆర్మీ S-400, ఆకాష్ ఎయిర్‌ సిస్టమ్‌తో ఈ మిసైల్స్, డ్రోన్లను కూల్చివేసింది.

New Update

Jammu Airport Attack:

భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్(Pakistan) చేస్తున్న వైమానిక దాడి ప్రయత్నాన్ని భారత భద్రతా బలగాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. జమ్మూ విమానాశ్రయం, పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ UAVలు, డ్రోన్లు, లోయిటరింగ్ మ్యూనిషన్స్‌ వినియోగించి దాడి చేయాలని పాకిస్తాన్ యత్నించింది. అయితే భారత రక్షణ వ్యవస్థలు అప్రమత్తంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

జమ్మూ ప్రాంతం మీదుగా అనుమానాస్పదమైన వైమానిక డ్రోన్లు రావడం గుర్తించగానే, భారత రక్షణ వ్యవస్థలో భాగమైన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో వెంటనే వాటిని తిప్పికోట్టింది భారత్. జమ్మూ, ఆర్నియా, ఆర్‌ఎస్ పురా, సాంబా ప్రాంతాలను లక్ష్యంగా చేసిన 8 మిసైళ్లను గాల్లోనే అడ్డుకోవడంలో భారత బలగాలు విజయవంతమయ్యాయి.

దాడి నేపథ్యంలో జమ్మూ ప్రాంతంలో ఎయిర్ రైడ్ సైరన్లు మోగించారు. ఆఖునూరు, కిష్త్వార్, బారాముల్లా సహా పలు ప్రాంతాల్లో బ్లాక్‌ ఔట్ అమలు చేసారు. జమ్మూ, పఠాన్‌కోట్, ఉదంపూర్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యల భాగంగా విద్యుత్ సరఫరా నిలిపి వేశారు.

Advertisment
తాజా కథనాలు