/rtv/media/media_files/2025/05/08/LVPwS6tfkl0nWi3ldrlK.jpg)
Reliance withdraws 'Operation Sindoor' trademark, says it was filed inadvertently
Reliance: పాకిస్థాన్(Pakistan), POKలోని 9 ఉగ్రస్థావరాలపై భారత సైన్యం(Indian Army) చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor) సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆపరేషన్ సిందూర్ పేరును ట్రేడ్‌మార్క్ చేసుకోవాలన్న యత్నాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనక్కి తగ్గంది. తమ సంస్థలో ఓ జూనియర్ ఉద్యోగి పర్మిషన్ తీసుకోకుండానే ఈ దరఖాస్తును దాఖలు చేశాడంటూ స్పష్టం చేసింది. రిలయన్స్ ఛైర్మన్ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆపరేషన్ సిందూర్ ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేసిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ దీనిపై క్లారిటీ ఇచ్చింది.
Also Read: పాక్ దాడులను తిప్పికొట్టాం.. కల్నల్ సోఫియా ఖురేషీ సంచలన వ్యాఖ్యలు
ప్రభుతానికి రిలయన్స్ పూర్తిగా మద్దతు
''ఆపరేషన్ సిందూర్ అనే పదాన్ని ట్రేడ్‌మార్క్ చేసే ఉద్దేశం రిలయన్స్ సంస్థకు లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ యూనిట్ అయిన జియో స్టూడియోస్.. ఒక జూనియర్ సిబ్బంది పర్మిషన్ లేకుండా పొరపాటున దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్ దరఖాస్తును ఉపసంహరించుకుంది. పహల్గాం ఉగ్రదాడి ప్రతిస్పందనగా భారత ఆర్మీ చేప్టటిన ఆపరేషన్ సిందూర్ పట్ల రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు ప్రతిఒక్కరు ఎంతగానో గర్విస్తున్నారు. ఉగ్రవాదంపై పోరాటలో సాయుధ దాళాలు, ప్రభుతానికి రిలయన్స్ పూర్తిగా మద్దతు ఇస్తుంది. ఇండియా ఫస్ట్ అనే నినాదానికి మేము కట్టుబడి ఉన్నామని'' రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది.
Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!
BREAKING:
— Bar and Bench (@barandbench) May 8, 2025
Reliance Industries (@RIL_Updates ) decides to withdraw its application to trademark 'Operation Sindoor' pic.twitter.com/GQPaKUTB6n
Also Read: జమ్మూకశ్మీర్‌లో వరదలు.. బాగ్లిహర్, సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తివేత
ఇదిలాఉండగా ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA), ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (IFTPC) వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం.. ఆపరేషన్ సిందూర్ అనే పేరును లేదా దాన్ని పోలి ఉండే టైటిల్స్‌ను రిజిస్టర్ చేసుకునేందుకు 30కి అప్లికేషన్లు వచ్చాయి. దీనికి దరఖాస్తు చేసిన వాటిలో జాన్ అబ్రహం, ఆదిత్య ధర్ వంటి ప్రముఖ నిర్మాతలు కూడా ఉన్నారు. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా దీనికి అప్లై చేసినట్లు వార్తలు రావడంతో తాజాగా ఆ సంస్థ దీనిపై క్లారిటీ ఇచ్చింది. తాము ఈ దరఖాస్తును ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేసింది.
Also Read: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్
telugu-news | rtv-news | national-news