AOB Encounter: ఏవోబీలో భారీ ఎన్‌కౌంటర్‌.. అగ్రనేతలు మృతి.. ఫైరింగ్ వీడియో వైరల్!

ఏవోబీలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అల్లూరి జిల్లా అరకులోయ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు నక్సల్స్ చనిపోయారు. మృతుల్లో ఇద్దరు అగ్రనేతలు జగన్, నాగన్న ఉన్నారు. జీకేవీధి ఏజెన్నీలో  కూంబింగ్ కొనసాగుతోంది. 

New Update

AOB Encounter: ఏవోబీలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అల్లూరి జిల్లా అరకులోయ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు నక్సల్స్ చనిపోయారు. మృతుల్లో ఇద్దరు అగ్రనేతలు జగన్, నాగన్న ఉన్నారు. జీకేవీధి ఏజెన్నీలో  కూంబింగ్ కొనసాగుతోంది. 

రూ.25 లక్షల రివార్డు..

ఈ మేరకు జీకే వీధి ఏజెన్సీలో మావోయిస్టులున్నారనే పక్కా సమాచారంతో కూంబింగ్ చేపట్టారు పోలీసులు. దీంతో ఇద్దరి మధ్య కాల్పులు చోటుచేసుకోగా నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ఇందులో మావోయిస్టు కీలక నేత జగన్‌ అలియాస్‌ పండన్న చనిపోయారు. జగన్‌పై రూ.20 లక్షల రివార్డ్ ఉంది. ఇక మరో ఇద్దరు మావోయిస్టులు సంకు నాచికా, రమేష్‌ మృతి సైతం మృతిచెందగా అతనిపై రూ. 5 లక్ష రివార్డ్ ఉంది. 

ఇది కూడా చూడండి: Mother’s Day 2025: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్

వాగా పొడియామి @ రమేష్@ నాగన్న మల గెట్ట గ్రామం,  కలిమెలా బ్లాక్, మల్కన్ గిరి జిల్లా ఒడిస్సా రాష్ట్రం DCM గా విధులు నిర్వహిస్తున్నాడు.  అల్లూరి సీతారామరాజు జిల్లా  కొమ్ములవాడ గ్రామానికి చెందిన.. కాకూరి పండన్న@ జగన్@ఆండ్రు@బిర్స@బీమా ఏవోబి స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

ఇది కూడా చూడండి: operation Sindoor: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!

 today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు