/rtv/media/media_files/2025/05/08/i5gb1ytMM25mbTc7zqTC.jpg)
Pakistan Air Defence Systems
భారత్ దాడిని తిప్పికొట్టడానికి ఏ మాత్రం వెనుకాడబోమని పాకిస్తాన్ వార్నింగ్ ఇస్తూ వచ్చింది. పాకిస్తాన్ ఆ పొగరుబోతు మాటల వెనుక చైనా పంపిన రక్షణ సామాగ్రి ఉంది. చైనా ఆయుధాల డొల్లతనం ఆపరేషన్ సిందూర్‌లో బయటపడింది. భారత వైమానిక దళం అంతర్జాతీయ సరిహద్దు దాటి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినా పాకిస్తాన్ నిఘూ వ్యవస్థ ఏం చేయలేక పోయింది. పాకిస్తాన్ రాడార్ వ్యవస్థ ఇండియన్ మిస్సేల్స్ ఎదుర్కొలేక పోయింది. భారత క్షిపణుల్ని, డ్రోన్లను అడ్డుకుని కూల్చివేయలేకపోయింది. పాక్ గగనతల రక్షణ వ్యవస్థల్లో అత్యధికం చైనా నుంచి కొనుగోలు చేసినవే కావడం, వాటి నిర్వహణలో అనేక సమస్యలుండడం పాక్‌కు శాపంగా మారుతోంది. 2011లో అమెరికా దళాలు అర్ధరాత్రి పాక్‌లోకి చొరబడి అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టాయి. ఆ ఆపరేషన్ కోసం అమెరికా రెండు బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు, ఒక చినూక్ హెలికాప్టర్, అనేక నిఘా డ్రోన్లను ఉపయోగించింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వాటిని అడ్డుకోలేకపోయాయి.
Also Read : తిరుమలలో మరోసారి అపచారం
Pakistan Air Defense Systems
#OperationSindoor wasn’t just a strike - it was a humiliation ritual.
— 𝕂𝕂 (@Try2StopME) May 8, 2025
Indian missiles sliced through Pakistani airspace while Chinese defence systems stood there like overpriced junkyard props.
Billions spent, zero detection. The so-called “iron brothers” just got steamrolled… pic.twitter.com/EUumeTVEyC
Also Read : పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. 14 మంది సైనికులు హతం.. లైవ్ వీడియో!
2019లో భారత మిరాజ్ యుద్ధ విమానాలు పాక్‌లోని బాలాకోట్‌లోకి ప్రవేశించి అక్కడి ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయి. అప్పుడు కూడా పాక్ కనిపెట్టి అడ్డుకోలేకపోయింది. 2022 మార్చిలో భారత్ బ్రహ్మోస్ క్షిపణి టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా పాక్‌లోకి ప్రవేశించి పాక్ గగనతలంలో 110 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. అయినా పాక్ ఎయిర్ డిఫెన్స్‌కు ఎంతమాత్రం తెలియలేదు. తాజాగా 2024 జనవరిలో ఇరాన్ పాక్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో గల ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి, డ్రోన్ దాడులు చేసింది. వాటిని కూడా అడ్డుకోలేక పాకిస్తాన్ చూస్తూ కూర్చుంది. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత క్షిపణులు, డ్రోన్లు తమ భూభాగంలోకి, పీవోకేలోకి ప్రవేశించినా పాక్ కనిపెట్టలేకపోయింది.
Also Read : ఎలాంటి అంచనాలు లేకుండా భారీ విజయం.. ఈ వారం బెస్ట్ మూవీ సజెషన్ ఇదే!
Also Read : రంగంలోకి కేఏ పాల్... పాకిస్తాన్‌తో చర్చలు.. యుద్ధం వద్దంటూ..!
(operation Sindoor | indian army operation sindoor | operation sindoor news | china | pakistan | latest-telugu-news)