/rtv/media/media_files/2025/05/08/HNU1CUwNQbS0hi9DQr08.jpg)
Operation Sindoor NTRO
Operation Sindoor NTRO: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో(Pakistan-Occupied Kashmir) 9 ఉగ్రస్థావరాలపై(Terrorist Bases) ఖచ్చితత్వంతో దాడులు చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Indian Air Force). 25 నిమిషాల్లోనే దాదాపు 100 మంది ఉగ్రవాదులను(Terrorists) మట్టుబెట్టారు. ఇంత తక్కువ సమయంలో సెలక్టివ్ టార్గెట్‌ను ఫినిష్ చేయడానికి ఆర్మీకి(Indian Army) బ్యాకెండ్ సపోర్ట్ అవసరం. అలాంటి బలమైన నిఘా, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందించిందే నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. చాలామందికి ముందుండి పోరాడే సైన్యం గురించే తెలుసు. కానీ.. ఒక అటాక్ విజయవంతం కావాలంటే దానికి పక్కా ప్లాన్, సమాచారం అవసరం. అది సమకూర్చిందే నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. పీవోకే ఉగ్రవాదుల కదలికలపై భద్రతా దళాలకు కచ్చితమైన సమాచారాన్ని అందించడం ద్వారా ఆపరేషను విజయవంతం అయ్యేలా ఈ సంస్థ పనిచేసింది.
భారతదేశ సాంకేతిక నిఘాసంస్థ(NTRO)ని 2004లో దీన్ని స్థాపించారు. ఇది నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి, జాతీయ భద్రతా సలహాదారుకు జవాబుదారీగా పనిచేస్తుంది. స్వయంప్రతిపత్తి గల సంస్థలా పనిచేస్తూ ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్‌కు సమానమైన రూల్స్ ఉంటుంది. 1999 కార్గిల్ యుద్ధంలో నిఘా లోపాల వల్ల ఇండియాకు కొంత నష్టం జరిగింది. వీటన్నింటీని సమీక్షించుకొని ఎన్టీఆర్వోను ఏర్పాటు చేశారు.
Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!
సూపర్ ఫీడర్ ఏజెన్సీ
అమెరికాకు చెందిన ‘నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ’ (ఎన్‌ఎస్‌ఏ) తరహాలో దీని రూపకల్పన జరిగింది. అప్పటి నుంచి సూపర్ ఫీడర్ ఏజెన్సీగా ఇది పనిచేస్తోంది. శాటిలైట్, ఇంటర్నెట్ నిఘా వంటి అధునాతన సాంకేతిక నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ ఏజెన్సీ తన సామర్థ్యాలను పెంపొందించుకోడానికి ప్రత్యేక వనరుల నుంచి రూ.700 కోట్లకు పైగా నిధులతో అధునాతన పరికరాలను కొనుగోలు చేసింది. గత రెండు దశాబ్దాలుగా ఎన్టీఆర్వో పలు సందర్భాల్లో కచ్చితమైన నిఘా సమాచారాన్ని అందించడంతో ఇండియా విజయాల్లో కీలకంగా నిలిచింది.
Also Read: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్
Also Read: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!
(National Technical Research Organization | india operation sindoor | Indian army-air force operation sindoor | india launches operation sindoor | latest-telugu-news)