Operation Sindoor: పాకిస్తాన్‌తో యుద్దం.. అన్ని పాఠశాలలు బంద్

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సరిహద్దు ప్రాంతాలైన పంజాబ్, రాజస్థాన్‌‌లో హై అలెర్ట్ జారీ అయింది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని పోలీసు సిబ్బంది సెలవులను అధికారులు రద్దు చేశారు. అలాగే ముందు జాగ్రత్తగా ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పాఠశాలలు మూతపడ్డాయి.

New Update

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత్ ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేసి దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులను ఖతం చేసింది. ఈ దాడుల అనంతరం భారత్- పాక్ మధ్య యుద్ద వాతావరణం మరింత తారాస్థాయికి చేరుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. 

ఇది కూడా చూడండి: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!

ind pak war

ఇందులో భాగంగానే భారత ప్రభుత్వం దేశ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా పంజాబ్ సరిహద్దు జిల్లాల్లో భద్రతను పెంచింది. ఈ మేరకు పంజాబ్ శాఖ తమ పోలీసు సిబ్బంది అందరి సెలవులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అది మాత్రమే కాకుండా ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరు సరిహద్దు జిల్లాలు.. ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, అమృత్‌సర్, గురుదాస్‌పూర్, తర్న్ తరణ్‌లలో అన్ని పాఠశాలలను మూసివేసింది. 

 ఇది కూడా చూడండి: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్కూల్స్ మూతపడనున్నాయి. పంజాబ్ పోలీసులలోని అధికారులు/ఉద్యోగుల సెలవులను మే 7 నుండి రద్దు చేస్తున్నట్లు పంజాబ్ డీజీపీ కార్యాలయం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే సెలవులు మంజూరు చేయాలని ఆ ఉత్తర్వులో పేర్కొంది. 

ఇది కూడా చూడండి: హైడ్రా పోలీస్ స్టేషన్ షురూ.. ఇక తోక జాడిస్తే.. రంగు పడుద్ది..!

ఇది మాత్రమే కాకుండా ఐకె గుజ్రాల్ పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ పరీక్షలను వాయిదా వేసింది. మే 8 నుంచి 10వ తేదీ వరకు జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసింది. ఈ మేరకు మే 12 నుంచి పరీక్షలు జరుగుతాయని తెలిపింది. 

ఇది కూడా చూడండి: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!

మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పరిపాలనా అధికారులు, పోలీసు సిబ్బంది సెలవులను రాజస్థాన్ ప్రభుత్వం రద్దు చేసినట్లు వర్గాలు తెలిపాయి. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పెరుగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ అన్ని పోలీసుల సెలవులను రద్దు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇది మాత్రమే కాకుండా ముందు జాగ్రత్త చర్యగా స్కూల్స్‌కు సెలవులు ప్రకటించారు. రాజస్థాన్‌లోని నాలుగు సరిహద్దు జిల్లాలు.. - శ్రీగంగానగర్, బికనీర్, జైసల్మేర్, బార్మెర్‌లలో అన్ని ప్రభుత్వ,  ప్రైవేట్ పాఠశాలలను మూసివేశారు. 

operation Sindoor | Pak India War | ind pak war | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు