Jammu Airport Attack - S 400: పాక్ జెట్ లను తుక్కు తుక్కు చేస్తున్న భారత్ ఫైటర్ జెట్లు..

జమ్మూలోని ఎయిర్‌పోర్టుపై పాకిస్తాన్ దాడి చేసింది. భారతఆర్మీ S-400 సాయంతో 8 పాక్ క్షిపణులను గాల్లోనే ధ్వంసం చేసింది. పాక్‌కు చెందిన F-16 ఫైటర్ జెట్, రెండు JF17 యుద్ధ విమానాలను కూల్చేసింది. భారత ఫైటర్ జెట్లు జమ్మూలోని పఠాన్ కోట్ నుంచి బయలుదేరాయి.

New Update

జమ్మూలోని వైమానిక స్థావరంపై పాకిస్తాన్ రాకెట్ దాడిని ప్రారంభించింది. దీంతో దానిని పసిగట్టిన భారత వైమానిక రక్షణ వ్యవస్థ పాక్ కుట్రను భగ్నం చేసింది. సుదర్శన్ చక్ర S-400 సాయంతో 8 పాకిస్తాన్ క్షిపణులను గాల్లోనే ధ్వంసం చేసింది. పాకిస్తాన్‌కు చెందిన F-16 ఫైటర్ జెట్, రెండు JF17 యుద్ధ విమానాలను ముక్కముక్కలు చేసింది.

S 400

భారత ఫైటర్ జెట్లు జమ్మూలోని పఠాన్ కోట్ నుంచి బయలుదేరాయి. మనవైపు వస్తున్న పాక్ రాకెట్లు, డ్రోన్‌లను గాల్లోనే లేపేందుకు  సిద్దమవుతున్నాయి. జమ్మూ సివిల్ విమానాశ్రయం, సాంబా, ఆర్ఎస్ పురా, అర్నియా, పొరుగు ప్రాంతాలపై పాకిస్తాన్ నుండి 8 క్షిపణులను పంపినట్లు భద్రతా సంస్థలు నిర్ధారించాయి. అయితే వాటన్నింటినీ S400 ద్వారా అడ్డుకున్నట్లు తెలిపారు.

ind pak war | latest-telugu-news | telugu-news | operation Sindoor

Advertisment
తాజా కథనాలు