BIG BREAKING: పాక్ దాడులను తిప్పికొట్టాం.. కల్నల్ సోఫియా ఖురేషీ సంచలన వ్యాఖ్యలు

ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి మరో కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సిందూర్‌ కొనసాగుతోందని.. తాము పాకిస్థాన్ ప్రజలను లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొన్నారు. పాక్‌ క్షిపణులను భారత సైన్యం తిప్పికొట్టిందని స్పష్టం చేశారు.

New Update

ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి మరో కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సిందూర్‌ కొనసాగుతోందని.. తాము పాకిస్థాన్ ప్రజలను లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొంది. పాకిస్థాన్ భారత మిలిటరీ స్థావరాలపై దాడులు చేసేందుకు యత్నించదన్నారు. కానీ పాక్‌ క్షిపణులను భారత సైన్యం తిప్పికొట్టిందని స్పష్టం చేశారు. అలాగే పాకిస్థాన్ ఎయిర్‌ ఢిఫెన్స్‌ యూనిట్లను ధ్వంసం చేసిందని చెప్పారు. '' నిన్న పాకిస్థాన్ ఆర్మీ భారత్‌లోని చాలా ప్రాంతాల్లో వైమానిక దాడులకు యత్నించింది. కానీ ఈ దాడులను మన భద్రతా వ్యవస్థ తిప్పికొట్టింది. 

Also Read: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన రష్యా S-400.. ఎలా పని చేస్తోందో తెలుసా?

పాకిస్థాన్‌కు చెందిన చాలావరకు ఎయిర్ ఢిఫెన్స్‌ సిస్టమ్స్‌ను కూడా భారత్‌ ధ్వంసం చేసింది. లాహోర్‌ ఎయిర్ డిఫెన్స్‌ సిస్టన్‌ నాశనమయ్యింది. LOC వెంట పాక్ కాల్పులకు దిగింది. ఈ ఘటనలో ఇప్పటిదాకా 16 మంది పౌరులు మృతి చెందారు. భారత్ ఇప్పుడు గట్టిగా బదులిస్తోంది. పాకిస్థాన్.. క్షిపణులు డ్రోన్లతో శ్రీనగర్, జమ్మూ, పంతాన్‌కోట్, అమృత్‌సర్‌, జలంధర్, భాటిం, చండిఘర్, భూజ్ తదితర ప్రాంతాలపై దాడులు చేసేందుకు యత్నించింది. ఈ దాడులను మన రక్షణ వ్యవస్థ నిర్వీర్యం చేసింది. పాక్ క్షిపణి, డ్రోన్‌ శిథిలాలను స్వాధీనం చేసుకుటున్నామని'' సోఫియా ఖురేషీ అన్నారు.   

telugu-news | rtv-news 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు