Vikram Misri: పాక్ చీకటి రహస్యాలు చెప్పిన విక్రమ్ మిస్రీ ఎవరో తెలుసా ?

ఆపరేషన్ సిందూర్ గురించి మీడియా సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పాక్ చీకటి రహస్యాలు వివరించారు. ఈయన కశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని ఓ పండిట్ కుటుంబలో జన్మించారు. విక్రమ్ మిస్రీ గురించి పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update
Foreign secretary of india vikram misri life story

Foreign secretary of india vikram misri life story

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్‌ పేరిట పాక్, POKలోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రి దాటాక భారత సైన్యం ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. అనంతరం బుధవారం ఉదయం 10.30 AM గంటలకు కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ మీడియా సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ గురించి వివరించేందుకు అక్కడ మొదట హాజరైన వ్యక్తి విక్రమ్ మిస్రీ. ఆయనతో పాటు ఇండియన్ ఆర్మీకి చెందిన ఇద్దరు మహిళా అధికారు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా ఉన్నారు. 

Also Read: 15 నిమిషాలు పవర్ ఇవ్వండి.. పాక్ ను నాశనం చేస్తాం.. MIM సంచలన ప్రకటన!

విక్రమ్‌ మిస్రి ప్రస్తుతం విదేశాంగ కార్యదర్శిగా ఉన్నారు. కశ్మీర్‌ పండిట్ కుటుంబంలో జన్మించిన ఆయన మీడియా సమావేశంలో ప్రపంచం ముందు పాక్‌ చీకటి రహస్యాలను బయటపెట్టారు. పాక్ ఉగ్రవాదానికి సంబంధించి అనేక ఆధారాలు ఇచ్చామని తెలిపారు. ఒసామా బిన్‌ లాడెన్ ఎక్కడ దొరికాడో, అతడ్ని అమరవీరుడు అని ఎవరు పిలిచారో గుర్తు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. 1964 నవంబర్ 7న విక్రమ్ మిస్రి మ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని ఓ పండిట్ కుటుంబలో జన్మించారు. 

తన ప్రాథమిక విద్యను శ్రీనగర్‌లోని బర్న్ హాల్ స్కూల్ అలాగే డిఏవీ స్కూల్‌లో పూర్తి చేశారు. అలాగే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సింధియా స్కూల్‌లో కూడా చదువుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం సివిల్స్‌కు సిద్ధమయ్యారు. 1989లో IFS అధికారిగా ఎంపికయ్యారు. ఈయన 1997లో అప్పటి ప్రధానమంత్రి ఇంజర్‌ కుమార్ గుజ్రాల్‌కు ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేసినప్పుడు వెలుగులోకి వచ్చారు. 

Also Read: పొరపాటు జరిగింది.. 'ఆపరేషన్ సిందూర్' ట్రేడ్‌మార్క్‌పై క్లారిటీ ఇచ్చిన రిలయన్స్

2012లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రైవేట్ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2014లో స్పెయిన్‌లో భారత రాయబారిగా కూడా పనిచేశారు. 2016లో మయన్మార్‌కు భారత రాయబారిగా నియమితులయ్యారు. 2019లో చైనాకు భారత రాయబారిగా నియమితులయ్యారు. అనంతరం ఆయన్ని ప్రధాని మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా కూడా నియమించారు. చివరికీ 2024లో భారత విదేశాంగ కార్యదర్శిగా నియమితులయ్యారు. 

Pahalgam attack | rtv-news | india pakistan war

#india pakistan war #rtv-news #telugu-news #Pahalgam attack
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు