/rtv/media/media_files/2025/05/08/TI3arFcXjnpOz6bwfb7z.jpg)
punjab border
భారత్‌లో చొరబాటుకు యత్నించిన ఓ పాకిస్థాన్ వ్యక్తిని బీఎస్‌ఎఫ్ జవాన్లు కాల్చి చంపేశారు. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. మే 07వ తేదీ బుధవారం అర్ధరాత్రి సమయంలో ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో పాకిస్థాన్ వ్యక్తి చొరబాటుకు యత్నించించాడు. చీకటినిఆసరాగా చేసుకుని బార్డర్ దాటలని ప్రయత్నించడాన్ని గమనించిన బీఎస్‌ఎఫ్ కాల్పులు జరిపారు. మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. కాగా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలతో మరొక పాకిస్తానీ జాతీయుడిని బీఎస్ఎఫ్ అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దులో బీఎస్ఎఫ్ నిఘా పెంచింది.
🚨 🚨 #BreakingNews BSF Shoots Down Alleged Pakistani Intruder In Firozpur https://t.co/lNowEo9KyD#TrendingNews #BigBreaking
— Instant News ™ (@InstaBharat) May 8, 2025