PM Modi: ఆపరేషన్ సిందూర్.. అఖిలపక్ష భేటీలో మోదీ కీలక ప్రకటన

ఆపరేషన్ సిందూర్ తర్వాత కేంద్రం నేడు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశమంతా కూడా ఐక్యంగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి జేపీ నడ్డా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.

New Update
Pm Modi meeting

Pm Modi meeting

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌పై విరుచుకుపడింది. ఈ క్రమంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అయితే ఉగ్రవాదం గురించి రాజకీయ పార్టీలకు వివరించడానికి కేంద్రం గురువారం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఆపరేషన్ సిందూర్ గురించి వివరించేందుకు కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని మోదీ నివాసంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశమంతా కూడా ఐక్యంగా ఉండాలని తెలిపారు. 

ఇది కూడా చూడండి: operation Sindoor: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!

ఇది కూడా చూడండి: Hydra Police Station: హైడ్రా పోలీస్ స్టేషన్ షురూ.. ఇక తోక జాడిస్తే.. రంగు పడుద్ది..!

విపక్ష నేతలు కూడా..

ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఈ అఖిలపక్ష భేటీలో కేంద్రమంత్రి జేపీ నడ్డాతో పాటు కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మలికార్జున్ ఖర్గే కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత అఖిలపక్ష భేటీ జరగడం ఇది రెండోసారి. దాదాపుగా గంట సేపు ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది.

ఇది కూడా చూడండి: Mother’s Day 2025: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు