/rtv/media/media_files/2025/05/08/vp1ZkOXjUi9ehMerg4Bx.jpg)
పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ సిందూర్‌ను కల్నల్ సోఫియా ఖురేషి మీడియా ముందు వివరించారు. ఇండియన్ ఆర్మీ బలాన్ని కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు ప్రపంచానికి చాటిచెప్పారు. దీంతో ఇండియా నారీశక్తి గురించి రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కల్నల్ సోఫియా ఖురేషి తండ్రి తాజ్ మొహమ్మద్ ఖురేషి చెప్పిన మాటలు వింటే అందరూ ఆర్చర్యపోతారు. ఆమె తండ్రి, తాత కూడా ఇండియన్ ఆర్మీలో పని చేశారు. ఆమె తండ్రి 1971 యుద్ధంలో పని చేశారు. ఆయనకున్న దేశభక్తి చాలా గొప్పది. ఈ వయసులో కూడా ఆయన అవకాశం ఇస్తే ఇండియా బోర్డర్‌కు వెళ్లి పాకిస్తాన్‌తో యుద్ధం చేస్తా అంటున్నారు.
#WATCH | Vadodara, Gujarat | Col Sofiya Qureshi briefed the media today on #OperationSindoor. Her father, Taj Mohammed Qureshi, says, "We are very proud. Our daughter has done a great thing for our country... Pakistan should be destroyed... My grandfather, my father, and I were… pic.twitter.com/mJ6AY6dWAT
— ANI (@ANI) May 7, 2025
గుజరాత్ వడోదర చెందిన కల్నల్ సోఫియా ఖురేషి ఆపరేషన్ సిందూర్ గురించి వివరించారు. దీంతో ఆమె తండ్రి తాజ్ మొహమ్మద్ ఖురేషి ఆనందం అంతా ఇంత కాదు. కల్నల్ సోఫియా ఖురేషి తండ్రి మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నారు. మా అమ్మాయిని చూసి మేము గర్విస్తున్నామని ఆయన అన్నారు. తాజ్ మొహమ్మద్ బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో కూడా పోరాడానని చెప్పారు. ఇప్పుడైనా సరే తనకు అవకాశం వస్తే పాకిస్తాన్‌తో యుద్ధంలో పోరాడుతానని తాజ్ మొహమ్మద్ చెప్పారు.
(Colonel Sophia Qureshi | latest-telugu-news india operation sindoor | operation sindhoor | celebrities on operation sindoor | Indian Army)