India-Pakistan: పాక్‌ ఆర్మీ కాల్పులు.. భారత జవాన్ వీరమరణం

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడింది. విచక్షణారహితంగా కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్‌ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై పాక్‌ కాల్పులు చేపట్టింది. ఈ కాల్పుల్లో భారత జవాన్ దినేశ్‌కుమార్‌ వీరమరణం పొందారు.

New Update

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్.. పాక్‌పై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ క్రమంలో పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ విరుచుకుపడింది. ఈ వైమానిక దాడుల్లో దాదాపుగా 90 మంది మృతి చెందారు. ఈ దాడుల తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విచక్షణారహితంగా కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్‌ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై పాక్‌ కాల్పులు చేపట్టింది.

ఇది కూడా చూడండి: operation Sindoor: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!

ఇది కూడా చూడండి: Hydra Police Station: హైడ్రా పోలీస్ స్టేషన్ షురూ.. ఇక తోక జాడిస్తే.. రంగు పడుద్ది..!

13 మంది భారత పౌరులు..

కేవలం నివాస ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని కాల్పులు చేపట్టగా భారత జవాన్ వీరమరణం పొందాడు. పాక్‌ షెల్లింగ్‌లో గాయపడి 5వ ఫీల్డ్‌ రెజిమెంట్‌కు చెందిన లాన్స్‌ నాయక్‌ దినేశ్‌కుమార్‌ వీరమరణం పొందినట్లు వెల్లడించింది. అలాగే 13 మంది భారత పౌరులు మృతిచెందారు. మరో 57 మంది తీవ్రంగా గాయపడినట్లు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది.

ఇది కూడా చూడండి:Mother’s Day 2025: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్

Advertisment
తాజా కథనాలు