Flash News: పాక్‌కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన ఇండియా.. క్షిపణులు, డ్రోన్లు గాల్లోనే ముక్కలు

పాకిస్తాన్ గురువారం రాత్రి ఇండియాలో 15 ప్రాంతాలపై దాడులు చేయాలని ప్రయత్నించింది. పాక్ క్షిపణులు, డ్రోన్లను ఇండియా ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎఎస్ గ్రిడ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు అడ్డుకున్నాయి. ఈ విషయాన్ని కేంద్రం అధికారికంగా ప్రకటించింది.

New Update
Pakistani drones, missiles

ఆపరేషన్ సిందూర్‌ను సహించలేని పాకిస్తాన్ ఇండియాను ఎలాగైనా దెబ్బ గొట్టాలని చూస్తోంది. గురువారం రాత్రి 15 నగరాలపై క్షిపణి దాడులు చేయాలని టార్గెట్‌ పెట్టుకుంది పాక్ ఆర్మీ. పాకిస్తాన్ వదిలిని క్షిపణులను, డ్రోన్లను తిప్పి కొట్టినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. గురువారం అర్థరాత్రి తర్వాత పాకిస్తాన్ భారతదేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలను టార్గెట్ చేసింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తల, జలంధర్, లూధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరాలాయ్, భుజ్‌లపై మిస్సైల్ దాడులు చేసింది. డ్రోన్‌లు, క్షిపణులను ఉపయోగించి ధ్వంసం చేయాలని ప్రయత్నించింది. వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎఎస్ గ్రిడ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు అడ్డుకున్నాయి. రాడార్లు కూల్చిన మిస్సైల్ శిథిలాలను ఇండియన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. అవి పాకిస్తాన్‌ నుంచి వచ్చినవేనా అని దర్యాప్తు చేస్తున్నారు. 

గురువారం ఉదయం భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌లోని అనేక ప్రదేశాలలో ఎయిర్ డిఫెన్స్ రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి  కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మెంధార్, రాజౌరి రంగాలలోని ప్రాంతాలలో పాకిస్తాన్ ఇండియాను రెచ్చగొట్టే విధంగా కాల్పులు తీవ్రత పెంచింది. పాకిస్తాన్ కాల్పుల కారణంగా ముగ్గురు మహిళలు, ఐదుగురు పిల్లలు సహా పదహారు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

(india operation sindoor | india launches operation sindoor | indian army operation sindoor | india pak war | latest-telugu-news | pakisthan)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు