ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ - పాకిస్తాన్ మధ్య మరింత ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత్‌లో మొత్తం 27 ఎయిర్‌పోర్టులను మూసివేశారు. అదే సమయంలో దాదాపు 430 విమానాలను రద్దు చేశారు. ఉత్తర, పశ్చిమ, మధ్య భారతదేశంలోని సుమారు 27 ఎయిర్‌పోర్టులను మే 10వ తేదీ (శనివారం) వరకు క్లోజ్ చేశారు. అందులో ఇండిగో, స్పైస్ జెట్, అకాసా ఎయిర్, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ సహా మరిన్ని విదేశీ విమానయాన సంస్థలు ఈ ఎయిర్‌పోర్టులకు రాకపోకలు సాగించే సర్వీసులను క్యాన్సిల్ చేసుకున్నాయి.
ఇది కూడా చూడండి: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!
అదే సమయంలో భారత విమానయాన సంస్థలు దాదాపు 430 విమానాలను క్యాన్సిల్ చేశాయి. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్ సంస్థలు పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించడం నిలిపివేశాయి. ఈ మేరకు దానికి బదులుగా ముంబై, అహ్మదాబాద్ మీదుగా విమానాలను ‘రీరూట్’ చేయడానికి రెడీ అయ్యాయి.
ఇది కూడా చూడండి: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్
ఈ ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టులు క్లోజ్
జమ్మూ, శ్రీనగర్, చండీగఢ్, లేహ్, అమృత్ సర్, పాటియాలా, లుధియానా, హల్వారా, బటిండా, భుంతర్, సిమ్లా, పఠాన్ కోట్, కిషన్ గఢ్, జైసల్మేర్, గగ్గల్, ధర్మశాల, ముంద్రా, జామ్ నగర్, జోధ్ ఫూర్, బికనీర్, రాజ్ కోట్, కేశోద్, భుజ్, పోర్ బందర్, కాండ్లా, హిందాన్, గ్వాలియర్ ఎయిర్‌పోర్టులను మే 10 వరకు టెంపరరీగా మూసివేశారు.
పాక్‌లో ఎయిర్‌పోర్టులు బంద్
మరోవైపు ఇండియా వరుసదాడులతో పాకిస్తాన్ వణికిపోతుంది. ఇండియా దాడి తర్వాత పాక్‌లో ఎయిర్‌పోర్టులు మూతపడ్డాయి. లాహోర్, కరాచీ ఎయిర్‌పోర్టులను పాకిస్తాన్ మూసివేసింది. రేపు ఉదయం 6 గంటల వరకు అన్ని రకాల విమానాలు బంద్ అయ్యాయి.మరోవైపు పోర్టుల్లోనూ ఎమర్జెన్సీ ప్రకటన జారీ అయింది.
ఇది కూడా చూడండి: హైడ్రా పోలీస్ స్టేషన్ షురూ.. ఇక తోక జాడిస్తే.. రంగు పడుద్ది..!
ఇది కూడా చూడండి: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!
operation Sindoor | ind pak war | ind pak war updates | latest-telugu-news | telugu-news