BIG BREAKING: జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై పాకిస్థాన్‌ దాడులు

జమ్మూకశ్మీర్‌లో చీకట్లు కమ్ముకున్నాయి. జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై పాకిస్థాన్‌ రాకెడ్‌ దాడి చేసింది. దీంతో ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని భారత సైన్యం హెచ్చరించింది. 

New Update
Pakistan Attack on Jammu Airport

Pakistan Attack on Jammu Airport

జమ్మూకశ్మీర్‌లో చీకట్లు కమ్ముకున్నాయి. జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై తాజాగా పాకిస్థాన్‌ మిసైల్స్, డ్రోన్ల దాడులకు పాల్పడింది. దీంతో రంగంలోకి దిగిన భారత ఆర్మీ వాటిని నేలకూల్చింది. దీంతో జమ్మూ నగరమంతా అధికారులు బ్లాక్‌ అవుట్ ప్రకటించారు. ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని భారత సైన్యం హెచ్చరించింది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పాక్ సరిహద్దుల్లో అన్ని జిల్లాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అలాగే జమ్మూకశ్మీర్‌ అంతటా ఇంటర్నెట్‌ సేవలు కూడా నిలిపివేశారు. 

Also Read: సైనిక దాడుల్లో ఉగ్రవాదులను మాత్రమే చనిపోయారు.. విక్రమ్ మిస్రీ

జమ్మూతో పాటు రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లో కూడా బ్లాక్‌అవుట్‌ చేశారు. జమ్ము సివిల్ ఎయిర్‌పోర్ట్, సాంబ, ఆర్ఎస్‌పుర, అర్నియా, ప్రాంతాల్లో 8 మిసైల్స్, డ్రోన్లతో దాడులకు యత్నించింది. వెంటనే స్పందించిన భారత ఆర్మీ S400, ఆకాష్ ఎయిర్‌ సిస్టమ్‌తో ఈ మిసైల్స్, డ్రోన్లను కూల్చివేసింది. మరోవైపు సాంబా జిల్లాలో పాక్‌ రేంజర్లు భారీగా కాల్పులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పలుచోట్ల భారీగా సైరన్ శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. కిష్త్వార్‌, అఖ్నూర్‌ సహా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. F-16 ఫైటర్ జెట్‌ను కూడా పాకిస్థాన్‌ ప్రయోగించగా.. దాన్ని కూడా ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది.

Advertisment
తాజా కథనాలు