🔴Live News Updates: ఇదే జరిగితే.. BJPకి ఈటెల రాజేందర్ రాజీనామా..!!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

Indigo Flight: తిరుపతి విమానంలో టెక్నిల్ గ్లిచ్..తప్పిన పెను ప్రమాదం

రేణిగుంట, హైదరాబాద్ ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో  పైలట్లు విమానాన్ని 40 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టించి, చివరికి తిరుపతిలోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు.

IndiGo Flight
IndiGo Flight

Also Read: ఆపరేషన్ సింధూర్ లో సాయం చేసిన బాలుడికి సైన్యం చేయూత

మరో విమానంలో సాంకేతక సమస్యలు బటపడ్డాయి. రేణిగుంట నుంచి హైదరాబాద్ బయలుదేరిన విమానంలో టెక్నికల్ గ్లిచ్ కారణంగా ఏసీలు పని చేయలేదు. విమాన టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఫ్లైట్ లో సాంకేతిక సమస్య ఉన్నట్లు పైలెట్లు గుర్తించారు. దీంతో వెంటనే అలెర్ట్ అయిన పైలెట్లు విమానాన్ని వెంటనే తిరుపతికే మళ్లించారు. అయితే ల్యాండింగ్‌ క్లియరెన్స్‌ ఆలస్యం కావడంతో 40 నిమిషాల పాటూ ఫ్లైట్ ను గాల్లోనే చక్కర్లు కొట్టించారు. దాని తరువాత తిరిగి తిరుపతిలోనే సేఫ్ ల్యాండింగ్ చేశారు. 

Also Read: పిల్లలతో ప్రయాణించే వాహనాలకు కొత్త రూల్స్.. పాటించకపోతే డబుల్ ఫైన్

ప్రయాణికుల ఆగ్రహం..

దాని తరువాత రేణిగుంట - హైదరాబాద్‌ సర్వీసును రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. ప్రయాణికులకు టికెట్‌ డబ్బులు వాపసు చేస్తామని చెప్పింది. అయితే అనుకున్న షెడ్యూల్ ప్రకారం విమానం నడవకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి తోడు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయకపోవడంతో వారు విమానాశ్రయంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులను ప్రశ్నిస్తూ, తమ గమ్యస్థానానికి వెళ్లే ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Also Read: Sravan Singh: ఆపరేషన్ సింధూర్ లో సాయం చేసిన బాలుడికి సైన్యం చేయూత

  • Jul 21, 2025 21:33 IST

    ఇదే జరిగితే.. BJPకి ఈటెల రాజేందర్ రాజీనామా..!!

    ఈటల రాజేందర్, బండి సంజయ్‌ల మధ్య కోల్ట్ వార్ జరుగుతోంది. స్థానిక ఎన్నికల్లో వారివారి అనుచరుల పోటీకి హోరాహోరీ సిఫార్సులు వస్తాయి. కరీంనగర్ జిల్లాలో ఇద్దరికి పట్టు ఉంది. ఈటల రాజేందర్ అనుచరులకు అవకాశం ఇవ్వకుంటే ఆయన BJPకి రాజీనామా చేస్తారని చర్చ నడుస్తోంది.

    Bandi Sanjay Vs Etela Rajender



  • Jul 21, 2025 21:30 IST

    కరెంట్‌ షాక్‌తో భర్తను చంపి..ఇంట్లోనే పాతిపెట్టి...

    అక్రమ సంబంధాలు, ఇష్టం లేని పెళ్లిళ్లు వంటి కారణాలతో భర్తలను భార్యలు చంపేస్తున్నారు. ఇటీవల కాలంలో భర్తలను చంపుతున్న భార్యల క్రైం స్టోరీలే ఎక్కువగా వింటున్నాము. తాజాగా ముంబైలోనూ అదే తరహా ఘటన చోటు చేసుకుంది. భర్తను చంపి ఇంట్లోనే పాతిపెట్టింది భార్య.

    Wife Kills Husband



  • Jul 21, 2025 21:29 IST

    దరిద్రం అంటే వీడిదే.. భర్తని నదిలోకి తోసిన భార్య కేసులో బిగ్ ట్విస్ట్.. భర్తపైనే కేసు

    కర్ణాటకలో భర్తను నదిలోకి తోసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న భార్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భార్య మైనర్ అని, ఆమెకు 16ఏళ్లు నిండలేదని బాలల హక్కుల కమిషన్ గుర్తించింది. దీంతో భర్త తాతప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

     

    wife pushed her husband into krishna river case Big twist
    wife pushed her husband into krishna river case Big twist

     



  • Jul 21, 2025 21:29 IST

    బిగ్ బాస్ బ్యూటీకి బెడిసికొట్టిన సర్జరీ!.. షాకింగ్ వీడియో

    బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ మరోసారి వార్తల్లో నిలిచింది. తన పెదవులకు వేయించుకున్న లిప్ ఫిల్లర్లను తొలగించుకున్నట్లు ఆమె తాజాగా ప్రకటించింది. ఈ ప్రక్రియకు ముందు, ఆ తర్వాత తన ముఖం ఎలా మారిందో చూపుతూ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

     

    Urfi Javed Lip Fillers Video
    Urfi Javed Lip Fillers Video

     



  • Jul 21, 2025 21:28 IST

    కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన!

    కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్‌న్యూస్‌. ఈ నెల25నుంచి రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.



  • Jul 21, 2025 20:17 IST

    రేపు టెట్ ఫలితాల విడుదల

    టెట్ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.  తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) 2025 జూన్ సెషన్ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలు ఆధికారిక వెబ్‌సైట్స్ లో అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

     

    TG TET 2025
    TG TET 2025

     



  • Jul 21, 2025 20:16 IST

    MP మిథున్ రెడ్డిని నేలపై పడుకోబెట్టిన జైలు అధికారులు

    జైల్లో MP మిథున్ రెడ్డికి వసతుల కల్పించే విషయంలో రాజమండ్రి జైలు అధికారుల నిర్లక్ష్యం వహించారు. జైళ్లో పడుకోడానికి ఆయనకు మంచం కల్పించాలి కోర్టు ఆదేశించింది. ఈ విషయంలో కోర్టు నోటీసులను జైలు సిబ్బంది పట్టించుకోవడం లేదట.

     

    MP Mithun Reddy
    MP Mithun Reddy

     



  • Jul 21, 2025 19:53 IST

    మరో కొద్దిగంటల్లో భారీ వర్షం.. అప్రమత్తం చేసిన పోలీసులు

    సోమవారం భారీవర్షం కురిసే అవకాశంఉందని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య భారీవర్షం కురిసే అవకాశం ఉన్నందును ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. అనవసరంగా బయటకు రావద్దని సూచించారు.

     



  • Jul 21, 2025 18:22 IST

    స్కూల్లో డెడ్‌బాడీలు.. చిన్నారుల ప్రాణాలు బలితీసుకున్న చైనా విమానం

    కాలేజీలో క్లాస్‌లు జరుగుతుండగా చైనాకు చెందిన ఎఫ్-7 శిక్షణ జెట్ విమానం కూలిపోయింది. 19 మంది మరణించగా, 70 మంది గాయపడ్డారు. ఢాకా అంతటా 70 మందికి పైగా గాయపడి ఆరు ఆసుపత్రులలో చేరారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం పేలుడు మంటలను ఆర్పారు.

     



  • Jul 21, 2025 18:10 IST

    ఓరి దేవుడా.. చీకటి తుఫాన్‌ను లైవ్‌లో చూశారా? - ఒళ్లు గగుర్పొడిచే వీడియో

    చైనా దక్షిణ తీరాన్ని టైఫూన్ విఫా అతలాకుతలం చేసింది. నల్లటి తుఫాను మేఘాలతో వచ్చిన విఫా హైనాన్‌ను తాకి, భారీ వర్షాలు, ఈదురు గాలులతో బీభత్సం సృష్టించింది. చీకటి మేఘాలతో కనిపించి ప్రజలను మరింత భయబ్రాంతులకు గురి చేసింది. ఆ వీడియో వైరల్‌గా మారింది. 

     

    dark storm clouds bring typhoon wipha to china southern coast
    dark storm clouds bring typhoon wipha to china southern coast

     



  • Jul 21, 2025 16:47 IST

    అమలాపురంలో దారుణం... వ్యక్తిని చితక్కొడుతూ వీడియోలు చిత్రీకరణ..

    అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దారుణం చోటు చేసుకుంది. దోనిపాటి మహేష్ అనే వ్యక్తి పై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అయినవిల్లి మండలం వెలువలపల్లికి చెందిన దోనిపాటి మహేష్ పై దాడి చేసిన ముగ్గురు దాడిసమయంలో వీడియోలు చిత్రీకరించారు.

    Amalapuram Crime News



  • Jul 21, 2025 16:47 IST

    మాజీ ముఖ్యమంత్రి మృతి

    కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌(101) సోమవారం కన్నుమూశారు. 2006-11 మధ్య ఆయన కేరళ సీఎంగా ఆయన పనిచేశారు. వెలిక్కకతు శంకరన్ అచ్యుతానందన్ 1923 అక్టోబరు 20లో జన్మించారు.



  • Jul 21, 2025 16:08 IST

    పూంచ్ లో పాఠశాలపై విరిగిపడ్డ కొండ చరియలు.. స్పాట్‌లో..

    జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (కల్సియన్ బైంచ్)పై కొండచరియలు విరిగిపడటంతో ఒక విద్యార్థి అక్కడక్కడే మరణించగా, నలుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డారు.

    Landslide that collapsed on a school



  • Jul 21, 2025 16:07 IST

    తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. భర్తతో ఫొటోలు వైరల్!

    బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల త్వరలో తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని సోనియా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్వయంగా వెల్లడించింది. తన బేబీ స్కాన్ రిపోర్ట్స్ పట్టుకొని భర్తతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది.

     

    Bigg Boss Soniya Akula
    Bigg Boss Soniya Akula

     

     

     



  • Jul 21, 2025 16:06 IST

    బుద్ధి రాలె.. బలుపు తగ్గలె.. లవర్‌తో కలిసి భర్తని చంపిన సోనల్ జైలులో ఏం చేస్తుందో తెలుసా!?

    మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ జైలు జీవితం ప్రారంభించి నెల రోజులైంది. షిల్లాంగ్‌ జైలులో నెల రోజులుగా ఉన్న సోనమ్‌లో ఎలాంటి మార్పు కనిపించడం లేదని, ఆమెలో పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదు. సోనమ్ రఘువంశీ జైలు వాతావరణానికి అలవాటు పడింది.

    sonam

     



  • Jul 21, 2025 15:38 IST

    చెల్లెను చంపి.. బట్టలు విప్పి - వినుకొండ కేసులో బయటపడ్డ షాకింగ్ నిజాలు!

    కడప జిల్లా గండికోట బాలిక హత్య కేసులో మిస్టరీ వీడింది. బాలిక సోదరులే చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రేమ వ్యవహారంతో కుటుంబ పరువు తీస్తుందనే కోపంతో అన్నలే హత్య చేశారని తెలిపారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. 

     

    Gandikota Girl
    Gandikota Girl

     



  • Jul 21, 2025 15:38 IST

    బండి, ఈటల వ్యవహారంపై అధిష్టానం సీరియస్‌

    బీజేపీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌, హుజూరాబాద్‌ మాజీ శాసనసభ్యుడు, ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

    Bandi Sanjay Vs Etela Rajender



  • Jul 21, 2025 15:37 IST

    షాకింగ్ వీడియో.. ట్రైన్ బ్రిడ్జ్‌పై ఉండగా కూలిపోయిన పునాది - వందలమంది ప్రాణాలు!

    హిమాచల్ ప్రదేశ్‌లోని ధాములో పెనుప్రమాదం తప్పింది. వందలాది మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు చక్కి నదిపై ఉన్న వంతెనను దాటుతుండగా కింద ఉన్న పునాది భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయానికి ట్రైన్ బ్రిడ్జ్‌ను దాటేయడంతో పెను ప్రమాదం తప్పింది. వీడియో వైరలవుతోంది.

     

    Dhamu train crossing Chakki River collapsed foundation
    Dhamu train crossing Chakki River collapsed foundation

     



  • Jul 21, 2025 15:37 IST

    తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత

    తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా ఆయన కిందపడిపోయారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రని అన్నా సలైలోని గ్రీమ్స్ రోడ్డులోని అపోలో హాస్పిటల్‌‌కు తరలించారు. అక్కడ సీఎంకు చికిత్స కొనసాగుతోంది.

    stalin 2

     

     



  • Jul 21, 2025 14:56 IST

    పవన్ ఫ్యాన్స్ కు హైదరాబాద్ పోలీసుల బిగ్ షాక్.. HHVM ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై కీలక నిర్ణయం!

    'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. కేవలం వెయ్యి నుంచి 15 వందల మందికి మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు నిర్వాహకులకు స్పష్టం చేశారు.

     

    HariHara VeeraMallu  pre release event
    HariHara VeeraMallu pre release event

     



  • Jul 21, 2025 14:42 IST

    కాలేజీపై కుప్పకూలిన విమానం!

    వరుస విమాన ప్రమాదాలు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. బంగ్లాదేశ్‌ ఢాకాలో ఎయిర్‌ఫోర్స్‌ శిక్షణ విమానం కాలేజీపై కూలిపోయింది. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. అధికారుల వెంటనే కాలేజీ దగ్గరకి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. 



  • Jul 21, 2025 14:42 IST

    తెలంగాణలో రెచ్చిపోయిన వీధి కుక్కలు.. ఒక్కరోజే 25 మంది..

    మెదక్ జిల్లా తూప్రాన్‌లో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఒక్కరోజే 25 మందిపై దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారులు తీవ్రంగా గాయపడటం అందరినీ కలచివేస్తుంది. కన్ను, ముక్కు, కాలు ఇలా శరీర భాగాలపై కరిచి రక్తం కళ్ల చూశాయి. ఈ సంఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టించింది.

     

    telangana Stray dogs attack 25 people in Medak district Thupran
    telangana Stray dogs attack 25 people in Medak district Thupran

     



  • Jul 21, 2025 14:41 IST

    సూర్యపేటలో భారీ చోరీ.. 18 కిలోల బంగారం మాయం

    సూర్యపేట జిల్లాలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. నగరంలో ఉన్న సాయి సంతోషి నగల దుకాణంలో జరిగిన దొంగతనంలో 18 కిలోల బంగారం, రూ.22 లక్షల నగదు చోరీ జరిగినట్లు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

     

    Gold Theft
    Gold Theft

     



  • Jul 21, 2025 13:42 IST

    Ananya Panday: వైట్ శారీలో క్యూట్ లుక్స్‌లో అనన్య పాండ్యా.. మస్త్‌ ఉందిగా!

    బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా వైట్ శారీలో క్యూట్ లుక్స్‌తో ఉండే ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

     

    Ananya Panday
    Ananya Panday

     



  • Jul 21, 2025 13:42 IST

    Murder Plan: సినిమా లెవెల్‌లో స్కెచ్.. మర్డర్ చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరణ.. చివరకు ఏమైందంటే?

    తెలంగాణలో జూరాల బ్రిడ్జిపై లైవ్‌లో మర్డర్‌ చేసి దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. బైక్‌పై వెళ్తున్న మహేష్‌ను కారుతో ఢీకొట్టడంతో నదిలోకి కొట్టుకునిపోయాడు. ఇతని కోసం గాలిస్తున్నారు. మహేష్ స్నేహితుడుకి తీవ్ర గాయాలయ్యాయి.

    Car Hits Bike Incident At Jurala🔴LIVE : జూరాల బ్రిడ్జిపై.. లైవ్‌లో | Priyadharshini Jurala Project



  • Jul 21, 2025 13:36 IST

    Alaska Airlines: ప్రయాణికులకు షాక్.. నిలిచిపోయిన వందలాది విమానాలు

    అమెరికాకు చెందిన అలస్కా ఎయిర్‌లైన్స్‌లో ఆదివారం రాత్రి టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. దీంతో వందలాది విమానాలను అత్యవరసర ల్యాండ్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాత్రి 8 గంటలకు తొలిసారిగా ఐటీ సిస్టమ్స్‌లో సమస్యలు తలెత్తాయి.

     

    Alaska Airlines
    Alaska Airlines

     



  • Jul 21, 2025 13:09 IST

    Lok Sabha: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా

    పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడి ఘటనపై చర్చింటాలని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. చివరికి స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు.

     

    Lok Sabha adjourned till 12 noon amid sloganeering by Opposition MPs
    Lok Sabha adjourned till 12 noon amid sloganeering by Opposition MPs

     



  • Jul 21, 2025 13:09 IST

    USA: అమెరికాలో భారత వైద్యుడి చిల్లర చేష్టలు.. అరెస్టు చేసిన పోలీసులు!

    అమెరికాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. మహిళా పేషెంట్లకు తప్పుడు డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్లు ఇచ్చి.. దీనికి బదులుగా తన కోరిక తీర్చాలని ఓ భారత సంతతి వైద్యుడు వాళ్లని లొబర్చుకుంటున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాజాగా అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

     

    Indian-Origin Doctor In US Charged With Medical Fraud
    Indian-Origin Doctor In US Charged With Medical Fraud

     



  • Jul 21, 2025 13:08 IST

    Mumbai Train blasts: ముంబయి రైలు పేలుళ్ల ఘటన.. అసలు ఆ రోజు ఏం జరిగింది ?

    ముంబయి రైలు పేలుళ్ల ఘటనపై బాంబే హైకోర్టు సోమవారం 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతకీ రైలు పేలుళ్ల ఘటనరోజు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

     

    Mumbai Train Blast
    Mumbai Train Blast

     



  • Jul 21, 2025 12:31 IST

    Pilot Rape Air Hostess: ముంబైలో సంచలనం.. ఎయిర్ హోస్టెస్‌పై పైలట్ రే*ప్..

    మహారాష్ట్ర థానేలో ఒక పైలట్, 23 ఏళ్ల ఎయిర్ హోస్టెస్‌పై తన ఇంట్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పైలట్ పరారీలో ఉన్నాడు.

     

    Pilot Rape Air Hostess
    Pilot Rape Air Hostess

     



  • Jul 21, 2025 10:37 IST

    Mumbai Train Blast: వాళ్లంతా నిర్దోషులే.. ముంబయి పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు!

    దాదాపు 20 ఏళ్ల క్రితం ముంబయిలో రైలు పేలుళ్ల ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో బాంబే హైకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. 2006లో జరిగిన ఈ ఘటనపై 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.

     

    2006 Mumbai train blasts, Bombay High Court acquits all 12 accused
    2006 Mumbai train blasts, Bombay High Court acquits all 12 accused

     



  • Jul 21, 2025 10:37 IST

    Pahalgam Attack: పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్‌

    పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్‌తో పాటు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అనంత్‌నాగ్‌ జిల్లాలో ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ సాయంతో ఓ ఉగ్ర అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

     

    UAPA accused arrested via facial recognition system in Jammu and Kashmir
    UAPA accused arrested via facial recognition system in Jammu and Kashmir

     



  • Jul 21, 2025 10:36 IST

    Indigo Plane: మళ్లీ భయపెడుతున్న వరుస విమాన ప్రమాదాలు

    ఇండిగో విమానాల్లో కూడా వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం తిరుపతి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. శనివారం మరో ఇండిగో విమానానికి మరో పెను ప్రమాదం తప్పింది.

     

    Indigo Plane
    Indigo Plane

     



  • Jul 21, 2025 10:35 IST

    Rape: దారుణం.. యువతిపై ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం !

    కర్ణాటకలోని బీదర్ జిల్లా జౌరాద్‌బీజీపీ ఎమ్మెల్యే ప్రభు చౌహన్ కొడుకు ప్రతీక్ చౌహన్‌పై అత్యాచార ఆరోపణలు రావడం కలకలం రేపింది. కాబోయే భార్యను ప్రతీక్ అత్యాచారం చేశాడనే ఆరోపణలతో బాధిత యువతి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

     

    Karnataka BJP MLA Prabhu Chauhan's son Prateek Chauhan accused of cheating woman
    Karnataka BJP MLA Prabhu Chauhan's son Prateek Chauhan accused of cheating woman

     



  • Jul 21, 2025 09:59 IST

    Maharashtra: ఛీ..ఛీ మరీ ఇలా దిగజారిపోయారా.. అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి

    మహారాష్ట్రలో ఆసక్తిర ఘటన చోటుచేసుకుంది. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మరోవైపు ఆ రాష్ట్ర మంత్రి సెల్‌ఫోన్‌లో రమ్మీ ఆడటం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది.

     

    Maharashtra minister Manikrao Kokate found playing rummy in Assembly
    Maharashtra minister Manikrao Kokate found playing rummy in Assembly

     



  • Jul 21, 2025 09:03 IST

    Israel-Gaza: గాజాపై ఇజ్రాయెల్ మారణహోమం.. 85 మంది మృతి!

    ఆహారం కోసం వేచి చూస్తున్న గాజా పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైనికులు భీకర దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో 85 మంది మృతి చెందారు. జికిం మీదుగా ఉత్తర గాజాలోకి వెళ్లే ఆహార ట్రక్కుల కోసం ఎదురుచూస్తున్న వారిపై దాడి చేశారు.

     

    Gaza
    Gaza

     



  • Jul 21, 2025 07:58 IST

    BIG BREAKING: ఒకేసారి రెండు ప్రాంతాల్లో భారీ భూకంపం.. మరికొన్ని గంటల్లో సునామీ!

    నేడు అలాస్కా, తజికిస్తాన్‌లో భూప్రకంపనలు సంభవించినట్లు అక్కడ అధికారులు తెలిపారు. తజికిస్తాన్‌లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు కాగా, అలస్కాలో 6.2గా నమోదైంది. అయితే సునామీ హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేశారు.

     

    earth quake in AP
    earth quake in AP

     



  • Jul 21, 2025 07:58 IST

    AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ .. వాట్సాప్ లో గుట్టు రట్టు

    ఏపీ లిక్కర్‌ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 1 వరకు ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. అయితే లిక్కర్ స్కామ్ గుట్టు వాట్సాప్‌ బయటపడింది.

     

    AP Liquor Scam
    AP Liquor Scam

     



  • Jul 21, 2025 07:32 IST

    Gut Health: అలర్ట్! ఇవి పాటించకపోతే మీ గట్ హెల్త్ షెడ్డుకే..!

    గట్ హెల్త్ అంటే పేగుల ఆరోగ్యం, ఇది జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, మానసిక స్థితి మీద ప్రభావం చూపుతుంది. ఫెర్మెంటెడ్ ఫుడ్స్, ఫైబర్, నీరు, వ్యాయామం, నిద్ర వల్ల గట్ మెరుగవుతుంది. ఆరోగ్య జీవనశైలికి ఇది ఎంతో కీలకం.

     

    Gut Health
    Gut Health

     



  • Jul 21, 2025 07:23 IST

    Crime News: భార్య చేతిలో బలైన మరో భర్త.. సాంబారులో విషం కలిపి హత్య

    వివాహేతర సంబంధం కోసం తినే ఫుడ్‌లో భార్య భర్తకు పురుగుల మందు కలిపి ఇచ్చి చంపేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. భర్తకు వాంతులు కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

     

    Tirupati Crime News
    Tirupati Crime News

     



  • Jul 21, 2025 06:45 IST

    BREAKING: పిల్లలతో ప్రయాణించే వాహనాలకు కొత్త రూల్స్.. పాటించకపోతే డబుల్ ఫైన్

    చిన్న పిల్లలతో ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే రెట్టింపు జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం మోటారు వాహన చట్టంలో మార్పులు తీసుకురావాలని ప్రతిపాదించింది. పిల్లల జాగ్రత్త కోసం ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.

    TRAFFIC RULES



Advertisment
Advertisment
తాజా కథనాలు