Bandi Sanjay Vs Etela Rajender : బండి, ఈటల వ్యవహారంపై అధిష్టానం సీరియస్‌

బీజేపీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌, హుజూరాబాద్‌ మాజీ శాసనసభ్యుడు, ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

New Update
Bandi Sanjay Vs Etela Rajender

Bandi Sanjay Vs Etela Rajender

బీజేపీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌, హుజూరాబాద్‌ మాజీ శాసనసభ్యుడు, ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా శనివారం శామీర్‌పేటలో తన నివాసానికి వచ్చిన హుజూరాబాద్‌ బీజేపీ అసంతృప్త నేతలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. నాయకుల మధ్య విభేదాల నేపథ్యంలో అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంపై అధిష్టానం సీరియస్‌ అయినట్లు సమచారం. ఇప్పటికే నోరు జారొద్దంటూ ఇద్దరికీ వార్నింగ్‌ ఇచ్చింది. 

ఇది కూడా చూడండి:Pahalgam Attack: పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్‌

Bandi Sanjay Vs Etela Rajender

ఇక సమస్యను పరిష్కరించడానికి కేంద్ర హోమంత్రి అమిత్‌ షా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కాగా వీరి వ్యవహారంపై తెలుసుకునేందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాంచందర్‌ రావును ఢిల్లీకి రావలసిందిగా అధిష్టానం పిలుపునిచ్చింది.-- బండి, ఈటల కామెంట్స్‌, సోషల్‌ మీడియాలో జరుగుతున్న..ప్రచారంపై నివేదికను సిద్ధం చేసుకున్న రాంచందర్‌రావు ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. దీనికోసం పార్టీ ముఖ్య నేతలతో రాష్ట్ర చీఫ్‌ రాంచందర్‌రావు చర్చలు జరిపారు. అధిష్టానం సూచనల ఆధారంగా తదుపరి యాక్షన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి:Mumbai Train Blast: వాళ్లంతా నిర్దోషులే.. ముంబయి పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు!

కాగా ఈటల రాజేందర్‌ బండిని ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం రేపాయి. అసలు నువ్వెవరు, నీ శక్తి ఎంత, నేను 2002లో జిల్లాకు వచ్చాను, మంత్రిగా పనిచేశాను, నేను అడుగుపెట్టని గ్రామం లేదు, ఖబర్దార్‌ బిడ్డా అంటూ హెచ్చరించాడు. సైకోగాడు, చిల్లరగాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై అధిష్టానం సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. 

అయితే రాష్ర్ట అధ్యక్షపదవి కోరుకున్న ఈటలకు పదవి దక్కకుండ సంజయ్ అడ్డుకున్నాడని ఈటల వర్గం భావిస్తుంది.ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్‌ ఈ రకమైన వ్యాఖ్యలు చేసి ఉంటారనే అభిప్రాయం పార్టీవర్గాల్లో వ్యక్తమవుతోంది. నిజానికి ఇద్దరి మధ్య గతం నుండే విభేదాలున్నాయని అవి ఇప్పుడు మరింత ముదిరినట్లు ప్రచారం సాగతోంది. దీనిపై పార్టీ అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుందోననే చర్చ మొదలైంది.

ఇది కూడా చూడండి:Cinema: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే

Also Read :  పూంచ్ లో పాఠశాలపై విరిగిపడ్డ కొండ చరియలు..స్పాట్‌లో..

bjp | bandi-vs-etela | bjp-etela-rajender | etela-rajender | bandi-sanjay

Advertisment
Advertisment
తాజా కథనాలు