Bigg Boss: తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. భర్తతో ఫొటోలు వైరల్!

బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల త్వరలో తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని సోనియా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్వయంగా వెల్లడించింది. తన బేబీ స్కాన్ రిపోర్ట్స్ పట్టుకొని భర్తతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది.

New Update
Bigg Boss Soniya Akula

Bigg Boss Soniya Akula

Bigg Boss: బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల త్వరలో తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని సోనియా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్వయంగా వెల్లడించింది. తన బేబీ స్కాన్ రిపోర్ట్స్ పట్టుకొని భర్తతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది.  ''మా గుండెల్లో ఒక భాగం  కొత్త ప్రాణంగా మారింది... మా ప్రేమ రెట్టింపవుతోంది'' అనే క్యాప్షన్ తో ఫొటోలను పంచుకుంది.  దీంతో అభిమానులు, బుల్లితెర సెలబ్రెటీలు సోనియా జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  

Also Read :  ఆల్‌ఔట్ అవసరమే లేదు.. ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే దోమలు పరార్!

2024లో పెళ్లి

సోనియా తన ప్రియుడు యష్ వీర్ ని 2024 డిసెంబర్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గ్రాండ్ గా వివాహం చేసుకుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్, బుల్లితెర నటులు, సినీ ప్రముఖులు చాలా మందే వీరి పెళ్ళికి హాజరయ్యారు. బిగ్ బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుందని అనుకున్న సోనియా ఊహించని విధంగా నాలుగవ వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. ఉన్నది మూడు వారాలే అయినప్పటికీ బాగానే ఫేమ్ సంపాదించుకుంది. 

Also Read :  పూంచ్ లో పాఠశాలపై విరిగిపడ్డ కొండ చరియలు..స్పాట్‌లో..

Also Read :  బుద్ధి రాలె.. బలుపు తగ్గలె.. లవర్‌తో కలిసి భర్తని చంపిన సోనల్ జైలులో ఏం చేస్తుందో తెలుసా!?

బిగ్ బాస్ తర్వాత సోనియా పలు టీవీ షోలు, ఈవెంట్లలో సందడి చేస్తూ ఉంది. 'ఇస్మార్ట్ జోడీ' కపుల్ షోలో తన భర్తతో కలిసి పాల్గొంది. ప్రస్తుతం సోనియా తన మ్యారీడ్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.  

Also Read:Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' ప్రమోషన్స్ .. పవన్ ప్రెస్ మీట్ లైవ్

today-news-in-telugu | telugu-film-news | telugu-cinema-news | latest-telugu-news | cinema-news

Advertisment
Advertisment
తాజా కథనాలు