Murder Plan: సినిమా లెవెల్‌లో స్కెచ్.. మర్డర్ చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరణ.. చివరకు ఏమైందంటే?

తెలంగాణలో జూరాల బ్రిడ్జిపై లైవ్‌లో మర్డర్‌ చేసి దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. బైక్‌పై వెళ్తున్న మహేష్‌ను కారుతో ఢీకొట్టడంతో నదిలోకి కొట్టుకునిపోయాడు. ఇతని కోసం గాలిస్తున్నారు. మహేష్ స్నేహితుడుకి తీవ్ర గాయాలయ్యాయి.

New Update

ఈ మధ్య కాలంలో హత్యలు చేసేసి.. వాటిని యాక్సిడెంట్‌గా చిత్రీకరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారు అనుకున్నది జరగడంతో పాటు ఈజీగా తప్పించుకోవచ్చని చాలా మంది ఇలా చేస్తున్నారు. ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా ఇలాంటి దారుణ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జూరాల బ్రిడ్జిపై లైవ్‌లో మర్డర్‌ చేసి దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. ఎదురుగా బైక్‌పై వస్తున్న వ్యక్తిని కారులోని వ్యక్తులు గుద్దారు. 

ఇది కూడా చూడండి:Cinema: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే

వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో..

కారు ఒక్కసారిగా ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరి మహేష్ అనే వ్యక్తి నదిలోకి పడ్డాడు. వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో మహేష్ నదిలో కొట్టుకునిపోయాడు. ఈ ఘటన జూరాల బ్రిడ్జి 53వ గేట్‌ వద్ద జరిగింది. బైక్‌పై ఉన్న ఇంకో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మహేష్ కోసం రెస్క్యూ టీమ్ గాలిస్తున్నారు. మర్డర్ చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇది కూడా చూడండి:Pahalgam Attack: పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్‌

ఇదిలా ఉండగా ఇటీవల డబ్బుల కోసం కన్న తల్లిని దారుణంగా చంపిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని నుహ్ జిల్లాలో 56 ఏళ్ల తల్లికి ఓ కొడుకు ఉన్నాడు. తల్లిని కొడుకు రూ.20 అడగడంతో ఇవ్వడానికి ఆమె నిరాకరించింది.

ఇది కూడా చూడండి:Mumbai Train Blast: వాళ్లంతా నిర్దోషులే.. ముంబయి పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు!

దీంతో కొడుకు తల్లిని దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. ఆ తల్లి అక్కడికక్కడే రక్తపు మడుగులో మృతి చెందింది. అయితే కుమారుడు ఏం చేయకుండా మద్యం, గంజాయి వంటి వాటికి బాగా అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే తల్లి డబ్బులు ఇవ్వకపోయే సరికి హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు వెంటనే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి:Tamil Nadu: అత్యాచారానికి గురైన యువతి.. ధైర్యంతో మరో యువతిని కాపాడిన వీర వనిత

Advertisment
Advertisment
తాజా కథనాలు