Maharashtra: ఛీ..ఛీ మరీ ఇలా దిగజారిపోయారా.. అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి

మహారాష్ట్రలో ఆసక్తిర ఘటన చోటుచేసుకుంది. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మరోవైపు ఆ రాష్ట్ర మంత్రి సెల్‌ఫోన్‌లో రమ్మీ ఆడటం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది.

New Update
Maharashtra minister Manikrao Kokate found playing rummy in Assembly

Maharashtra minister Manikrao Kokate found playing rummy in Assembly

మహారాష్ట్రలో ఆసక్తిర ఘటన చోటుచేసుకుంది. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మరోవైపు ఆ రాష్ట్ర మంత్రి సెల్‌ఫోన్‌లో రమ్మీ ఆడటం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది. మంత్రిపై విపక్షాలతో పాటు నెటిజన్లు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న మణిక్‌రావ్ కోకాటే.. ఫోన్‌లో రమ్మీ ఆడుతున్నట్లు NCP(SP) ఎమ్మెల్యే రోహిత్ పవార్‌ ఆరోపణలు చేశారు. ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు.   

Also Read: భార్య చేతిలో బలైన మరో భర్త.. సాంబారులో విషం కలిపి హత్య

సభలో రైతుల సమస్యలపై చర్చలు జరుగుతుంటే కోకాటే ఇలాంటి పనికి పాల్పడ్డారు. రాష్ట్రంలో రోజుకు 8 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ ఇవేమి పట్టించుకోకుండా ఆయన ఆటలాడుతున్నారని'' రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోకాటేపై చర్యలు తీసుకోవాలని సీఎం ఫడ్నవీస్‌కు శివసేన (UBT) నేత ఆనంద్ దుబే విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి కోకాటే స్పందించారు. తాను యూట్యూబ్‌లో వీడియో చూస్తుండగా రమ్మీ ఆట యాడ్‌ వచ్చిందని.. రెండుసార్లు దాన్ని తొలగించేందుకు యత్నించానని తెలిపారు. విపక్షాలు కావాలనే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు.  

Also Read: పిల్లలతో ప్రయాణించే వాహనాలకు కొత్త రూల్స్.. పాటించకపోతే డబుల్ ఫైన్

Advertisment
Advertisment
తాజా కథనాలు