/rtv/media/media_files/2025/07/21/uapa-accused-arrested-via-facial-recognition-system-in-jammu-and-kashmir-2025-07-21-10-05-42.jpg)
UAPA accused arrested via facial recognition system in Jammu and Kashmir
పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్‌తో పాటు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22న జరిగిన ఈ దాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్పటి నుంచి జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు ఉగ్రవేటను ప్రారంభించాయి. ఉగ్ర అనుమానితులను పట్టుకునేందుకు తనిఖీలు చేస్తున్నాయి. ఇందుకోసం పోలీసులు సాంకేతిక సాయం కూడా తీసుకుంటున్నారు. తాజాగా అనంత్‌నాగ్ జిల్లాలో ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ సాయంతో ఓ ఉగ్ర అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: దారుణం.. యువతిపై ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం !
నిందితుడిని ద్రాంగ్‌బల్ పాంపోర్‌కు చెందిన మునీబ్ ముస్తాఖ్ షేక్‌గా గుర్తించారు. గనీశ్‌బల్‌లోని ఎక్స్‌రే పాయింట్ వద్ద జమ్మూకశ్మీర్ పోలీసులు ఫేసియల్ రికగ్నిషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అక్కడే అతడిని గుర్తించాక వెంటనే కంట్రోల్ రూమ్‌కు ఆ సిస్టమ్ సమాచారమిచ్చింది. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి మునీబ్ అనే అనుమానితుడిని అరెస్టు చేశారు.
Also Read: ఛీ..ఛీ మరీ ఇలా దిగజారిపోయారా.. అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి
విచారణలో అతడిపై యూఏపీఏ చట్టం కింద పలు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలీసులు తదుపరి విచారణను ప్రారంభించారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలు పెంపొందించేందుకు అలాగే నిందితులను త్వరగా పట్టుకునేందుకు ఈ ఫెషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఎంతో సాయపడుతుందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఉగ్ర అనుమానితుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.