Sravan Singh: ఆపరేషన్ సింధూర్ లో సాయం చేసిన బాలుడికి సైన్యం చేయూత

ఆపరేషన్ సింధూర్ లో ఆర్మీకి సాయం చేసిన ధైర్య సాహసాలు ప్రదర్శించిన బాలుడు శ్రాణ్ సింగ్ కు చేయూతను ఇచ్చేందుకు భారత ఆర్మీ ముందుకు వచ్చింది. అతని పూర్తి చదువు కోసం అయ్యే ఖర్చును భరిస్తామని చెప్పింది.

New Update
sravan

Sravan Singh

ఆపరేషన్ సింధూర్ లో వీర జవాన్లతో పాటూ ఓ బాలుడు కూడా ప్రముఖ పాత్ర పోషించాడు.  భారత్ - పాకిస్థాన్ సరిహద్దుకు అతి సమీపంలో ఉన్న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా తారావాలీ గ్రామానికి చెందిన శ్రావణ్ సింగ్  కాల్పుల మోతలో కూడా భయపడకుండా జవాన్లకు సాయం చేశాడు. మామూలుగా అయితే భారత్, పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే సరిహద్దు గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతారు. కానీ శ్రవణ్ మాత్రం అలా అనుకోలేదు. తన వయసు పదేళ్లే అయినా అంతకు మించి ఆలోచించాడు. తనకు అవకాశం దొరికినప్పుడల్లా జవాన్లకు తాగడానికి మంచినీళ్లు, పాలు, లస్సీ లాంటి వాటిని అందించాడు.

పూర్తి చదువుకయ్యే ఖర్చు..

అప్పుడే శ్రావణ్ సింగ్ ధైర్య సాహసాలకు గుర్తింపుగా సత్కారం చేశారు. అయితే ఇప్పుడు తాజాగా సైన్యంలోని గోల్డెన్ యారో డివిజన్ తాజాగా అతడి చదువుకయ్యే ఖర్చులు పూర్తిగా భరించేందుకు ముందుకొచ్చింది. ఫిరోజ్‌పుర్‌ కంటోన్మెంట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వెస్ట్రన్‌ కమాండ్‌ జీవోసీ లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ కుమార్‌ కటియార్‌ శ్రావణ్ ను సత్కరించారు. ఇలాంటి వీరులకు సరైన గుర్తింపు లభించడం చాలా అవసరమని...అందుకే అతని చదువుకు అయ్యే ఖర్చులన్నీ భరించడానికి ముందుకు వచ్చామని చెప్పారు. 

Also Read: BIG BREAKING: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై దాడి!

Advertisment
తాజా కథనాలు