/rtv/media/media_files/2025/07/01/father-killed-his-son-with-wood-in-ntr-district-2025-07-01-14-48-09.jpg)
Tamil Nadu Crime News
Tamil Nadu Crime News: ఈ మధ్య కాలంలో భార్యలు భర్తలను దారుణంగా హత్య చేస్తున్నారు. వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉంటున్నారని భార్యలు ప్లాన్ చేసి మరి భర్తలను(Husband) హతం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన తమిళనాడులో(Tamilnadu) చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో రసూల్(35) అనే ఓ వ్యక్తి ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.
ఇది కూడా చూడండి:Alcohol: మద్యం మానేస్తే ఆరోగ్యంపై కలిగే ప్రయోజనాలు ఇవే.. 30 రోజులు ఇలా ట్రై చేయండి
పురుగుల మందు ఉన్నట్లు..
ఇతనికి భార్య అమ్ముబీ, ఓ కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. అయితే ఒక రోజు రసూల్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు చేసుకొని, వెంటనే స్పృహ కోల్పోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రిలో చేర్చి పరీక్షలు చేశారు. ఈ శాంపిల్స్‌లో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు.
ఇది కూడా చూడండి:Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ ప్రభుతం రూ. కోటి బహుమతి!
రసూల్ భార్యపై అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆమె మొబైట్ చాటింగ్స్ చూశారు. వారికి సమీపంలో సెలూన్ నడుపుతున్న లోకేశ్వరన్‌తో ఆమె సంబంధం పెట్టుకున్నట్లు గుర్తించారు. తనతో చేసిన చాట్‌లో ‘నువ్వు ఇచ్చిన విషం మొదట దానిమ్మ రసంలో కలిపానని.. కాకపోతే నా భర్త అది తాగలేదు.
ఇది కూడా చూడండి:Producer AM Ratnam: ‘హరి హర వీరమల్లు’ నిర్మాతపై ఫిర్యాదు.. ఆందోళనలో ఫ్యాన్స్
అందులో తినే ఫుడ్ సాంబార్‌లో కలిపానని లోకేశ్వరన్‌కి తెలిపింది. ఈ సమయంలోనే రసూల్ చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. ఇతని మృతితో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. వీరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే కేసు నమోదు చేసి అమ్ముబీ, లోకేశ్వరన్‌లను అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: రాజాసింగ్ సంచలన నిర్ణయం.. ‘ఉపఎన్నికల్లో పోటీ చేసి ఆ పార్టీని ఓడిస్తా’