Karnataka : దరిద్రం అంటే వీడిదే.. భర్తని నదిలోకి తోసిన భార్య కేసులో బిగ్ ట్విస్ట్.. భర్తపైనే కేసు

కర్ణాటకలో భర్తను నదిలోకి తోసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న భార్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భార్య మైనర్ అని, ఆమెకు 16ఏళ్లు నిండలేదని బాలల హక్కుల కమిషన్ గుర్తించింది. దీంతో భర్త తాతప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

New Update
wife pushed her husband into krishna river case Big twist

wife pushed her husband into krishna river case Big twist

కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఇటీవల ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. సెల్ఫీ తీసుకుందామనే నెపంతో భర్తను కృష్ణానదిలోకి తోసేసిందన్న ఆరోపణలు ఒక భార్యపై వచ్చాయి. అయితే ఈ కేసు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా

ఏం జరిగిందంటే?

కర్ణాటకలోని రాయచూరుకు చెందిన తాతప్ప అనే వ్యక్తి తన భార్యతో కలిసి కృష్ణానది వద్దకు వెళ్లాడు. అక్కడ సెల్ఫీలు తీసుకుందామని చెప్పి, వంతెన అంచున నిలబడమని భార్య కోరగా.. తాతప్ప అలాగే నిలబడ్డాడు. ఈ క్రమంలో భార్య తనను నదిలోకి తోసేసిందని తాతప్ప ఆరోపించాడు. నది ప్రవాహంలో కొట్టుకుపోతుండగా, తాతప్ప ఒక బండరాయిని పట్టుకుని కేకలు వేశాడు. అతని అరుపులు విన్న స్థానికులు వెంటనే స్పందించి.. తాళ్ల సహాయంతో తాతప్పను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. 

Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?

కేసులో బిగ్ ట్విస్ట్

తాతప్ప ప్రాణాలతో బయటపడిన తర్వాత తన భార్య తనను హత్య చేయడానికి ప్రయత్నించిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కేసు దర్యాప్తులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భార్య మైనర్ అని, ఆమెకు 16 సంవత్సరాలు కూడా నిండలేదని బాలల హక్కుల కమిషన్ గుర్తించింది. దీంతో తాతప్ప మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడని నిర్ధారించిన అధికారులు, అతనిపై పోక్సో (Protection of Children from Sexual Offences) చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం పోలీసులు తాతప్పపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన భార్యాభర్తల మధ్య గొడవ, హత్యాయత్నం ఆరోపణలతో ప్రారంభమై, ఇప్పుడు బాల్యవివాహం, పోక్సో చట్టం కింద నేరంగా మారింది. 

Also Read:ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలువురు దీనిపై విస్మయం వ్యక్తం చేశారు. భార్య మాత్రం తాను భర్తను తోయలేదని, ప్రమాదవశాత్తు జారిపడిపోయాడని వాదిస్తోంది. ఈ కేసులో మరింత సమాచారం దర్యాప్తులో వెలువడే అవకాశం ఉంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు