/rtv/media/media_files/2025/07/21/mumbai-train-blast-2025-07-21-10-46-12.jpg)
Mumbai Train Blast
ముంబయి రైలు పేలుళ్ల ఘటనపై బాంబే హైకోర్టు సోమవారం 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతకీ రైలు పేలుళ్ల ఘటనరోజు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. 2006 జులై 11న ముంబయి పశ్చిమ రైల్వే లైన్‌లో పలు సబర్బన్ రైళ్లలో వరుసగా ఏడు బాంబు పేలుళ్లు జరిగాయి. కేవలం 11 నిమిషాల వ్యవధిలోనే ఇవి జరిగాయి. ఈ ప్రమాదంలో 189 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో 800 మంది గాయాలపాలయ్యారు.అయితే ఈ దాడులకు లష్కర్- ఎ -తోయిబా, స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా సంస్థలతో సంబంధాలున్నట్లు పోలీసులు ఆరోపించారు. ఈ ఘటనపై దర్యాప్తు తర్వాత 2015లో అక్టోబర్‌లో స్పెషల్ కోర్టు 12 మంది నిందితులను దోషులుగా తేల్చింది.
Also Read: పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్
వీళ్లలో ఐదుగురికి బాంబు అమర్చారనే అభియోగాలపై మరణశిక్ష విధించింది. అలాగే మిగతా ఏడుగురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. మరణశిక్ష పడిన నిందుతుల్లో కమల్ అన్సారీ, పైజల్ షైక్, ఎస్తేషామ్ సిద్ధిఖీ, నవేద్ హుస్సేన్, ఆసిఫ్ బషీర్ ఖాన్‌లు ఉన్నారు. జీవిత ఖైదు శిక్ష పడిన వాళ్లలో షేక్ ఆలం షేక్ (41), మహ్మద్ సాజిద్ అన్సారీ (34) తన్వీర్ అహ్మద్ అన్సారీ (37), సోహిల్ మెహమూద్ షేక్ (43), జమీర్ అహ్మద్ షేఖ్ (36), మహ్మద్ మాజిద్ షఫీ (32), మజ్జమిల్ షేక్ (27) ఉన్నారు.
అయితే వీళ్లలో కమల్ అన్సారీ అనే వ్యక్తి 2021లో కరోనా వల్ల నాగ్‌పుర్ జైలులో మృతి చెందాడు. అయితే ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై దోషులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు వాటిని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది. 2015 నుంచి ఈ కేసు వ్యవహారం హైకోర్టులో పెండింగ్‌లోనే ఉంది.
Also Read: ఛీ..ఛీ మరీ ఇలా దిగజారిపోయారా.. అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి
దీనిపై చాలావరకు అభ్యర్థనలు వచ్చాయి. ఆ తర్వాత 2024లో జులైలో హైకోర్టు రోజువారీ విచారణ నిమిత్తం ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అప్పటినుంచి విచారణ జరుగుతూనే ఉంది. అయితే సోమవారమ ఆ 12 మంది దోషులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితులను దోషులగా తేల్చడంలో ట్రయల్ కోర్టు సరిగా వ్యవహరించలేదని పేర్కొంది. నిందితులపై నేరాభియోగాలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని స్పష్టం చేసింది.
Also Read: ఒకేసారి రెండు ప్రాంతాల్లో భారీ భూకంపం.. మరికొన్ని గంటల్లో సునామీ!