/rtv/media/media_files/2025/07/21/sonam-2025-07-21-15-51-09.jpg)
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ జైలు జీవితం ప్రారంభించి నెల రోజులైంది. ఆమె భర్త రాజా రఘువంశీ హత్య కేసులో సోనమ్ నిందితురాలిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. షిల్లాంగ్‌లోని జైలులో నెల రోజులుగా ఉన్న సోనమ్‌లో ఎలాంటి మార్పు కనిపించడం లేదని, ఆమెకు పశ్చాత్తాపం లేదని వార్తలు వస్తున్నాయి. సోనమ్ రఘువంశీ జైలు వాతావరణానికి బాగా అలవాటు పడింది. ఆమె ప్రతిరోజూ జైలు నియమావళిని పాటిస్తోంది. ఇతర మహిళా ఖైదీలతో కూడా ఆమె బాగా కలిసిపోయిందని సమాచారం. అయితే, ఆమె తన భర్త హత్య గురించి గానీ, తన వ్యక్తిగత జీవితం గురించి గానీ ఏ ఖైదీతో లేదా జైలు సిబ్బందితో మాట్లాడటం లేదు.
Also Read : పూంచ్ లో పాఠశాలపై విరిగిపడ్డ కొండ చరియలు..స్పాట్‌లో..
Meghalaya Honeymoon Murder Case
Sonam Raghuvanshi, who was earlier reported missing along with her husband during her honeymoon in Meghalaya, has been arrested from UP.
— Mr Sinha (@MrSinha_) June 9, 2025
Meghalaya Police revealed that she had plotted her husband’s murder & had given a contract for the same.. New normal😑 pic.twitter.com/3KxAAYKqPm
Also Read : ఆల్‌ఔట్ అవసరమే లేదు.. ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే దోమలు పరార్!
సోనమ్ జైలు వార్డెన్ కార్యాలయానికి సమీపంలోని బ్యారక్‌లో ఉంటుందని, ఇద్దరు అండర్ ట్రయల్ మహిళా ఖైదీలతో బ్యారక్‌ను పంచుకుంటుందని తెలుస్తోంది. జైలులో ఆమెకు ఇంకా ఎలాంటి పని అప్పగించలేదు. అయితే, ఆమెకు టైలరింగ్, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ఇతర పనులు నేర్పించనున్నట్లు సమాచారం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జైలు నిబంధనల ప్రకారం సోనమ్ తన కుటుంబ సభ్యులను కలవడానికి అవకాశం ఉంది. ఆమె ఇప్పటివరకు ఎవరినీ కలవలేదు. ఆమె ఫ్యామిలీ కూడా సోనామ్‌ని కలవడానికి జైలుకు రాలేదు. కనీసం వారికి ఫోన్ కూడా చేయలేదని తెలుస్తోంది. భర్తను చంపిన సోనమ్‌ను సొంత కుటుంబం కూడా ఒంటరిని చేసింది.
Also Read : తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. భర్తతో ఫొటోలు వైరల్!
ఈ కేసు దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సోనమ్‌కు సంజయ్ వర్మ అనే వ్యక్తితో సంబంధం ఉందని, హత్యకు ముందు అతనితో వందల సార్లు ఫోన్‌లో మాట్లాడిందని పోలీసులు గుర్తించారు. అలాగే, హత్య జరిగిన తర్వాత సోనమ్ బర్ఖా ధరించి సుమారు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి, ఎక్కడా ఆగకుండా పుట్టింటికి చేరుకుందని విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా అని, అతనితో కలిసి సోనమ్ ఈ దారుణమైన హత్యకు ప్లాన్ చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే సోనమ్‌తో పాటు ఆమె ప్రియుడు, మరికొందరిని అరెస్టు చేశారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
Also Read : చెల్లెను చంపి.. బట్టలు విప్పి - వినుకొండ కేసులో బయటపడ్డ షాకింగ్ నిజాలు!
latest-telugu-news | Honeymoon Murder Case | jail | Raja Raghuvanshi | Meghalaya Honeymoon Murder Case