/rtv/media/media_files/2025/07/21/amalapuram-crime-news-2025-07-21-16-29-12.jpg)
Amalapuram Crime News
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దారుణం చోటు చేసుకుంది. దోనిపాటి మహేష్ అనే వ్యక్తి పై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అయినవిల్లి మండలం వెలువలపల్లికి చెందిన దోనిపాటి మహేష్ పై దాడి చేసిన ముగ్గురు దాడిసమయంలో వీడియోలు చిత్రీకరించారు. శనివారం రాత్రంతా అమలాపురం,అల్లవరం మండలాల్లో తిప్పుతూ మహేశ్ పైదాడి చేశారు. వారి దాడి నుంచి తప్పించుకున్న మహేశ్ అమలాపురం ఏరియా ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్నాడు.
ఇది కూడా చూడండి:Producer AM Ratnam: ‘హరి హర వీరమల్లు’ నిర్మాతపై ఫిర్యాదు.. ఆందోళనలో ఫ్యాన్స్
Atrocity In Amalapuram
కాగా, విషయం తెలుసుకున్న అమలాపురం పోలీసులు ఆ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా అరెస్ట్ అయిన వారిలో యల్లమిల్లి విజయ్, కృష్ణ, మహేష్‌లు ఉన్నారు. వీరిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన అమలాపురం పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇది కూడా చూడండి: రాజాసింగ్ సంచలన నిర్ణయం.. ‘ఉపఎన్నికల్లో పోటీ చేసి ఆ పార్టీని ఓడిస్తా’
గతంలో అమలాపురం మున్సిపాలిటీలో పనిచేసిన సిరసపల్లి ఉదయశంకర్, రాయల్ కాలేజీ ప్రిన్సిపల్ గుత్తుల విజయకుమార్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురు యువకుల నుండి వీరు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అమలాపురం మున్సిపాలిటీలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని కొత్తపేట మండలం అవిడికి చెందిన సకిలే రాజశేఖర్ నుండి 2లక్షలు తీసుకుని మోహం చాటేసినట్లు ఆరోపణలున్నాయి. కాగా,
సకిలే రాజశేఖర్ తరుపున దోనిపాటి మహేష్ మధ్యవర్తిత్వం వహించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనపై కక్ష కట్టి దాడి చేసారని ఆరోపించాడు. కాగా, మహేశ్ పై దాడి చేసి కులం పేరుతో దూషించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇది కూడా చూడండి: Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ ప్రభుత్వం రూ. కోటి బహుమతి!
Also Read : స్కూల్లో డెడ్‌బాడీలు.. చిన్నారుల ప్రాణాలు బలితీసుకున్న చైనా విమానం
attack | ambedkar-konaseema-district | arrest | crime news telugu | amalapuram