/rtv/media/media_files/2025/07/21/urfi-javed-lip-fillers-video-2025-07-21-20-45-42.jpg)
Urfi Javed Lip Fillers Video
బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్.. ఈ పేరు తెలియనివారంటూ ఉండరు. సోషల్ మీడియాలో మునిగితేలుతున్న వారందరికీ ఈమె పేరు బాగా గుర్తుంటుంది. తరచూ తన బోల్డ్ డ్రెస్సింగ్‌తో వార్తల్లో నిలుస్తుంది ఈ అమ్మడు. కొత్త కొత్త డిజైన్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది.
Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా
Urfi Javed Lip Fillers Video
తాజాగా ఈ అందాల బోల్డ్ బ్యూటీ.. మరోసారి వార్తల్లో నిలిచింది. తన పెదవులకు వేయించుకున్న లిప్ ఫిల్లర్లను తొలగించుకున్నట్లు ఆమె తాజాగా ప్రకటించింది. ఈ ప్రక్రియకు ముందు, ఆ తర్వాత తన ముఖం ఎలా మారిందో చూపుతూ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్‌గా మారాయి.
Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?
ఉర్ఫీ తెలిపిన వివరాల ప్రకారం.. తనకు 18 సంవత్సరాల వయసు నుంచే లిప్ ఫిల్లర్స్ ఉన్నాయని, దాదాపు 9 ఏళ్ల తర్వాత వాటిని తొలగించుకోవాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది. ఈ ప్రక్రియ చాలా బాధాకరంగా ఉందని, ఫిల్లర్స్ తొలగించిన వెంటనే తన పెదవులు, ముఖం వాచిపోయాయని వివరించింది. ‘‘దయచేసి ఈ వీడియోను మీ స్వంత రిస్క్‌తో చూడండి’’ అని హెచ్చరించింది. తన ఫిల్లర్‌లు సరిగ్గా లేవని అనిపించిందని, అందుకే వాటిని తొలగించుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. ముఖ్యంగా తన ‘లాఫ్ లైన్స్’ (నవ్వినప్పుడు వచ్చే ముడతలు), పెదవుల ఫిల్లర్లను తొలగించుకున్నట్లు తెలిపింది.
Also Read:ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే
उर्फी जावेद ने 9 साल बाद हटावाए लिप फिलर
— Khushbu (@sumankumari_143) July 20, 2025
ट्रीटमेंट का वीडियो देखो pic.twitter.com/J9bViyHn8M
అయితే ఫిల్లర్లను పూర్తిగా వదిలేయనని స్పష్టం చేసింది. ‘‘నేను ఫిల్లర్లకు అసలు నో చెప్పడం లేదు. 2-3 వారాల తర్వాత మళ్లీ సహజంగా చేయించుకుంటాను. కరిగించడం చాలా బాధాకరమైనది. ఫిల్లర్‌ల కోసం మంచి డాక్టర్ వద్దకు వెళ్లడం చాలా ముఖ్యం. ఫ్యాన్సీ క్లినిక్‌లలో ఉన్న వైద్యులకు ఏమీ తెలియదు’’ అని సలహా ఇచ్చింది. ఆమె ‘డాక్టర్ రిక్సన్’ అనే డెర్మటాలజిస్ట్ వద్ద ఈ చికిత్స చేయించుకున్నట్లు తెలిపింది. ఇక ఈ సర్జరీ తర్వాత ఆమె పెదవులు ఉబ్బడం వీడియోలో చూడవచ్చు.
Also Read:పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్
movie-news | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news