Poonch : పూంచ్ లో పాఠశాలపై విరిగిపడ్డ కొండ చరియలు..స్పాట్‌లో..

జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (కల్సియన్ బైంచ్)పై కొండచరియలు విరిగిపడటంతో ఒక విద్యార్థి అక్కడక్కడే మరణించగా, నలుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
Landslide that collapsed on a school

Landslide that collapsed on a school

జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉన్న చోలన్ కల్సన్ గ్రామంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. స్థానికంగా ఉన్న ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (కల్సియన్ బైంచ్)పై కొండచరియలు విరిగిపడటంతో ఒక విద్యార్థి అక్కడక్కడే మరణించగా, నలుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డారు. కాగా గాయపడిన క్షతగాత్రులను పూంచ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన విద్యార్థి వయస్సు 5 ఏండ్లని తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకోవడంతో ఆసుపత్రి ఆవరణ రోదనలతో నిండిపోయింది.

ఇది కూడా చూడండి:Pahalgam Attack: పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్‌

Also Read :  అమలాపురంలో దారుణం... వ్యక్తిని చితక్కొడుతూ వీడియోలు చిత్రీకరణ..

Landslide Collapsed On School

గాయపడిన వారికి సరైన వైద్య సహాయం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆదేశించారు. పూంచ్ జిల్లా కలెక్టర్ వికాస్ కుండల్, ఎసిఆర్ మహమ్మద్ సయీద్ ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన విద్యార్థులకు ఎలాంటి ప్రాణపాయం లేదని, వారు త్వరలోనే కోలుకోవాలని అధికారులు ఆకాక్షించారు. కాగా, ప్రమాదం విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి:Mumbai Train Blast: వాళ్లంతా నిర్దోషులే.. ముంబయి పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు!

ఇది కూడా చూడండి:Tamil Nadu: అత్యాచారానికి గురైన యువతి.. ధైర్యంతో మరో యువతిని కాపాడిన వీర వనిత

Jammu and Kashmir | landslides | landslide | Jammu and Kashmir updates | jammu-and-kashmir-police | jammu and kashmir news | accident-in-jammu-and-kashmir

Advertisment
Advertisment
తాజా కథనాలు