/rtv/media/media_files/2025/07/21/alaska-airlines-2025-07-21-13-33-40.jpg)
Alaska Airlines
అమెరికాకు చెందిన అలస్కా ఎయిర్‌లైన్స్‌లో ఆదివారం రాత్రి టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. దీంతో వందలాది విమానాలను అత్యవరసర ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాత్రి 8 గంటలకు తొలిసారిగా ఐటీ సిస్టమ్స్‌లో సమస్యలు తలెత్తాయి. దీంతో అలస్కా, హారిజోన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలను ల్యాండ్ చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇక వివరాల్లోకి సియాటెల్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఎయిర్‌లైన్స్ టెక్నికల్ సమస్య సోమవారం సాయంత్రం వరకు ఉండే ఛాన్స్ ఉంటుందని పేర్కొంది.
Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా
మరోవైపు ఈ ఘటనపై అమెరికా FAA కూడా వెంటనే స్పందించలేదు. చివరికి ఈ ఎయిర్‌లైన్స్ నిర్ణయం వల్ల వివిధ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అయితే అలస్కా గ్రూప్ 238 బోయింగ్ 737లు, అలాగే 87 ఎంబ్రార్ 175 విమానాలు నిర్వహిస్తోంది. ఈ సేవల తాత్కాలిక అంతరాయనికి ఆ ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రయాణికులకు క్షమాపణలు కూడా తెలియజేసింది.
Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?
ఇదిలాఉండగా దాదాపు ఏడాది క్రితం అలస్కా ఎయిర్‌లైన్స్.. కొత్తగా కొనుగోలు చేసిన బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానం గాల్లో ఉండగానే డోర్ ఊడిపోవడం కలకలం రేపింది. 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత బోయింగ్ 737 మాక్స్ విమానాలు పూర్తిగా పక్కన పెట్టారు. తనిఖీలు నిర్వహించారు. గత నెలలోనే దీనిపై ఓ నివేదిక వచ్చింది. అందులో బోయింగ్ తమ సిబ్బందికి సరైన ట్రైనింగ్ ఇవ్వనట్లు తేలింది.