/rtv/media/media_files/2025/07/21/gut-health-2025-07-21-07-29-56.jpg)
Gut Health
Gut Health: ఈ మధ్య కాలంలో "గట్ హెల్త్"(Gut Health) అనే పదం ఎక్కువ వినిపిస్తోంది. మన జీర్ణ వ్యవస్థలో ఉండే సూక్ష్మజీవుల సమూహాన్ని 'గట్ మైక్రోబయోమ్'(Gut Microbiome) అంటారు. ఇవి మన ఆరోగ్యానికి చాలా కీలకం. శరీరంలో 70%కు పైగా రోగనిరోధక శక్తి గట్‌లోనే ఉంటుంది. కాబట్టి గట్ ఆరోగ్యంగా ఉంటేనే మనమూ ఆరోగ్యంగా ఉండగలుగుతాం.
Also Read:Alcohol: మద్యం మానేస్తే ఆరోగ్యంపై కలిగే ప్రయోజనాలు ఇవే.. 30 రోజులు ఇలా ట్రై చేయండి
గట్ హెల్త్ మెరుగుపర్చే చిట్కాలు(Tips to Improve Gut Health):
- ఫెర్మెంటెడ్ ఫుడ్స్(Fermented Foods): పెరుగు, బటర్ మిల్క్, కొంబుచా వంటి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ గుడ్ బ్యాక్టీరియాను పెంచుతాయి.
- ఫైబర్ ఆహారం(Fiber Food): సొరకాయ, బీన్స్, గింజలు వంటి ఆహారం పదార్ధాలు గట్‌ను శుభ్రంగా ఉంచుతాయి.
- నీటిని పుష్కలంగా త్రాగడం(Drink Plenty of Water): మంచి జీర్ణక్రియకు నీరు అవసరం.
- ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకండి(Processed Foods): జంక్ ఫుడ్, స్వీట్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్ గట్ హెల్త్‌ను దెబ్బతీయగలవు.
- నిద్ర, వ్యాయామం(Sleep and Exercise): ఇవి కూడా గట్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.
Also Read: Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ ప్రభుతం రూ. కోటి బహుమతి!
గట్ హెల్త్ బాగుండడం వలన జీర్ణక్రియ మెరుగవుతుంది, స్కిన్ గ్లో ఉంటుంది, మానసిక ఆరోగ్యమూ మెరుగవుతుంది. కాబట్టి, రోజూ ఈ చిన్న చిన్న అలవాట్లతో మీ గట్‌ను కాపాడుకోండి!
Also Read: Producer AM Ratnam: ‘హరి హర వీరమల్లు’ నిర్మాతపై ఫిర్యాదు.. ఆందోళనలో ఫ్యాన్స్