Indigo Flight: తిరుపతి విమానంలో టెక్నికల్ గ్లిచ్..తప్పిన పెను ప్రమాదం

రేణిగుంట, హైదరాబాద్ ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో  పైలట్లు విమానాన్ని 40 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టించి, చివరికి తిరుపతిలోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు.

New Update
IndiGo Flight

IndiGo Flight

మరో విమానంలో సాంకేతక సమస్యలు బటపడ్డాయి. రేణిగుంట నుంచి హైదరాబాద్ బయలుదేరిన విమానంలో టెక్నికల్ గ్లిచ్ కారణంగా ఏసీలు పని చేయలేదు. విమాన టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఫ్లైట్ లో సాంకేతిక సమస్య ఉన్నట్లు పైలెట్లు గుర్తించారు. దీంతో వెంటనే అలెర్ట్ అయిన పైలెట్లు విమానాన్ని వెంటనే తిరుపతికే మళ్లించారు. అయితే ల్యాండింగ్‌ క్లియరెన్స్‌ ఆలస్యం కావడంతో 40 నిమిషాల పాటూ ఫ్లైట్ ను గాల్లోనే చక్కర్లు కొట్టించారు. దాని తరువాత తిరిగి తిరుపతిలోనే సేఫ్ ల్యాండింగ్ చేశారు. 

ప్రయాణికుల ఆగ్రహం..

దాని తరువాత రేణిగుంట - హైదరాబాద్‌ సర్వీసును రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. ప్రయాణికులకు టికెట్‌ డబ్బులు వాపసు చేస్తామని చెప్పింది. అయితే అనుకున్న షెడ్యూల్ ప్రకారం విమానం నడవకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి తోడు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయకపోవడంతో వారు విమానాశ్రయంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులను ప్రశ్నిస్తూ, తమ గమ్యస్థానానికి వెళ్లే ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Also Read: Sravan Singh: ఆపరేషన్ సింధూర్ లో సాయం చేసిన బాలుడికి సైన్యం చేయూత

Advertisment
తాజా కథనాలు