BIG BREAKING: పవన్ ఫ్యాన్స్ కు హైదరాబాద్ పోలీసుల బిగ్ షాక్.. HHVM ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై కీలక నిర్ణయం!

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. కేవలం వెయ్యి నుంచి 15 వందల మందికి మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు నిర్వాహకులకు స్పష్టం చేశారు.

New Update
HariHara VeeraMallu  pre release event

HariHara VeeraMallu pre release event

'పుష్ప 2'  సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత సినిమా ఈవెంట్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు పర్మిషన్ ఇచ్చే విషయంలో తెలంగాణ పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలోనూ అదే ఫాలో అవుతున్నారు. ఈరోజు శిల్పా కళా వేదికగా జరగనున్న ఈ ఈవెంట్ కి షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు.  

Also Read :  వామ్మో దీనిని తింటే ఇన్ని వ్యాధులు తగ్గుతాయ..? ఎందుకు లేట్..!!

15 వందల మందికి మాత్రమే

కేవలం వెయ్యి నుంచి 15 వందల మందికి మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు నిర్వాహకులకు స్పష్టం చేశారు. అలాగే ఈవెంట్ పూర్తి భాద్యత నిర్మాతదేనని కండీషన్ పెట్టారు. పాసులు లేకుండా బయట ఉండిపోయే అభిమానులందరినీ మీరే కంటోలో చేసుకోవాలని నిర్వాహకులకు, నిర్మాతకు సూచించారు. పాసులు ఉన్నవారికి మాత్రమే లోపలి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. దాదాపు నాలుగేళ్ళ తర్వాత పవన్ సినిమా వస్తుండడంతో అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా..  ముందస్తు జాగ్రత్తగా తక్కువ మందికే అనుమతి ఇచ్చారు పోలీసులు. 

Also Read :  చెల్లెను చంపి.. బట్టలు విప్పి - వినుకొండ కేసులో బయటపడ్డ షాకింగ్ నిజాలు!

Also Read :  బండి, ఈటల వ్యవహారంపై అధిష్టానం సీరియస్‌

ఇదిలా ఉంటే .. రీసెంట్ గా భద్రతా చర్యల దృష్ట్యా ఎన్టీఆర్  'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏకంగా  క్యాన్సిల్ చేశారు. ఈవెంట్ కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండడంతో.. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎన్టీఆర్ సామజిక మాధ్యమం ద్వారా తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. 

పీరియాడిక్ డ్రామాగా రూపొందిన  'హరిహరవీరమల్లు' రెండు భాగాలుగా విడుదల కానుంది.  ఇందులో మొదటి భాగం ఈనెల జులై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం. రత్నం నిర్మించగా.. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. ఖుషీ, బంగారం సినిమాల తర్వాత దాదాపు 18ఏళ్ళ గ్యాప్ తో పవన్-  ఏఎం. రత్నం కాంబోలో వస్తున్న మూడవ సినిమా ఇది. ఇందులో పవన్ ఒక చారిత్రాత్మక యోధుడిగా కనిపించబోతున్నారు. 

Also Read:Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' ప్రమోషన్స్ .. పవన్ ప్రెస్ మీట్ లైవ్

Pawan Kalyan | harihara-veeramallu-movie

Advertisment
Advertisment
తాజా కథనాలు