/rtv/media/media_files/2025/07/21/pilot-rape-air-hostess-2025-07-21-12-24-45.jpg)
Pilot Rape Air Hostess
Pilot Rape Air Hostess: మహారాష్ట్రలోని(Maharashtra) థానే జిల్లాలో ఒక ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ పైలట్(Private Airline Pilot), తన సహోద్యోగి అయిన 23 ఏళ్ల ఎయిర్ హోస్టెస్‌పై అత్యాచారం(Air Hostess Rape Case) చేశాడన్న ఆరోపణలు వెలుగుచూశాయి. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Also Read:Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ ప్రభుతం రూ. కోటి బహుమతి!
ఎవరూ లేని టైం చూసి..
వివరాల్లోకి వెళితే, మీరా రోడ్ ప్రాంతంలో వేర్వేరుగా నివసిస్తున్న వీరిద్దరూ ముంబై నుంచి లండన్ వెళ్లిన విమానంలో కలసి విధులు నిర్వహించారు. మళ్లీ ముంబైకు(Mumbai) తిరిగివచ్చిన వీరిద్దరు ఒకే వాహనంలో తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే,ఈ క్రమంలో పైలట్ ఆమెను తన ఇంటికి ఆహ్వానించాడు. ఇంట్లో ఎవరూ లేని టైం చూసి పైలట్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
Also Read: Alcohol: మద్యం మానేస్తే ఆరోగ్యంపై కలిగే ప్రయోజనాలు ఇవే.. 30 రోజులు ఇలా ట్రై చేయండి
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అత్యాచార ఘటనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతనిని త్వరలోనే అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. ముంబైలో ఈ ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.
Also Read: రాజాసింగ్ సంచలన నిర్ణయం.. ‘ఉపఎన్నికల్లో పోటీ చేసి ఆ పార్టీని ఓడిస్తా’