/rtv/media/media_files/2025/07/21/ap-liquor-scam-2025-07-21-07-42-23.jpg)
AP Liquor Scam
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 1 వరకు ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. అయితే లిక్కర్ స్కామ్ గుట్టు వాట్సాప్ బయటపడింది. ఈ కేసులో ఏ1 నిందితుడు రాజ్ కసిరెడ్డి పీఏ మల్లేశ్ మొబైల్‌కు SOM డిస్టిలరీస్ అధ్యక్షుడు దివాకరం పంపిన వాట్సాప్ మెసేజ్‌లను అధికారులు గుర్తించారు. డిస్టిలరీ యజమానులను లొంగదీసుకునేందుకు వైసీపీ మద్యం మాఫియా ఎలాంటి విధానాలు పాటించిందో.. ఎలాంటి అరాచకాలకు పాల్పడిందో ఛార్జ్‌షీట్‌లో ఉన్నాయి.
Also Read: భార్య చేతిలో బలైన మరో భర్త.. సాంబారులో విషం కలిపి హత్య
కెసిరెడ్డి పీఏ మల్లేశ్ మధ్య సంభాషణల ద్వారా గోలుసు కంపెనీల వ్యవహారంలో ఏ8 చాణక్య, ఏ7 అవినాశ్ రెడ్డి, ఏ6 సజ్జల శ్రీధర్ రెడ్డి, ఏ9 కిరణ్‌తో ఉన్న సంబంధాలు గుర్తించారు. వైసీపీ ఆగ్రోకు చెందిన శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి వాట్సాప్‌లో.. రాజ్ అంకుల్ అంకుల్ రెండు, మూడు రోజుల్లో అందుబాటులో ఉంటారా ? వారి వార్షిక లైసెన్సు ఫీజు పునరుద్ధరణ, గత నెల పనితీరుపై మాట్లాడేందుకు టైం చెప్పండని మల్లేశ్ ఫోన్‌కు పంపించారు.
Also Read: పిల్లలతో ప్రయాణించే వాహనాలకు కొత్త రూల్స్.. పాటించకపోతే డబుల్ ఫైన్
ఇక 2020 జనవరి 26న సాయిరెడ్డి అన్న ఇంటికి వెళ్తున్నామని మల్లేశ్ నుంచి కిరణ్‌కు మెసేజ్ వెళ్లింది. అదే ఏడాది ఫిబ్రవరి 24 మల్లేశ్ కిరణ్‌కు పంపిన మరో మెసేజ్‌లో సార్ మిథున్‌రెడ్డి గెస్ట్‌లో ఉన్నారని ఉంది. మే 23న కిరణ్ నుంచి మల్లేశ్‌కు మరో మెసేజ్ వచ్చింది. రేపటి షెడ్యూల్ ఉదయం 11 గంటలకు గచ్చిబౌలిలో అదాన్ మీటింగ్, మధ్యాహ్నం 1కి సాయన్న ఇల్లు, 2.30 గంటలకు వినీత్ ఆఫీస్‌లో లంచ్, 3.30 గంటలకు మిథున్ రెడ్డి అన్న, సాయంత్ర 5 గంటలకు గోపి అన్న, 6 గంటలకు ధనంజయ్ రెడ్డి సాక్షి అని అందులో కనిపించింది.