Theft: సూర్యపేటలో భారీ చోరీ.. 18 కిలోల బంగారం మాయం

సూర్యపేట జిల్లాలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. నగరంలో ఉన్న సాయి సంతోషి నగల దుకాణంలో జరిగిన దొంగతనంలో 18 కిలోల బంగారం, రూ.22 లక్షల నగదు చోరీ జరిగినట్లు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

New Update
Gold Theft

Gold Theft

సూర్యపేట జిల్లాలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. నగరంలో ఉన్న సాయి సంతోషి నగల దుకాణంలో జరిగిన దొంగతనంలో 18 కిలోల బంగారం, రూ.22 లక్షల నగదు చోరీ జరిగినట్లు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాపు వెనుకవైపు ఉన్న షట్టర్ ను గ్యాస్ కట్టర్ తో కట్ చేసిన దొంగలు షాపులోకి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం షాపు ఓపెన్ చేసిన యజమాని చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.  

ఇది కూడా చూడండి:Cinema: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే

Also Read :  షాకింగ్ వీడియో.. ట్రైన్ బ్రిడ్జ్‌పై ఉండగా కూలిపోయిన పునాది - వందలమంది ప్రాణాలు!

Massive Theft In Suryapet

కాగా భారీ చోరీ జరిగిన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ నరసింహ దుకాణాన్ని పరిశీలించారు. నిందితులను పట్టుకోవడానికి మొత్తం 5 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. షాప్ యజమాని కిశోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. చోరీ జరిగిన నగల వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. దొంగలు రెక్కీ నిర్వహించి ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోందని ఎస్పీ పేర్కొన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

ఇది కూడా చూడండి:Mumbai Train Blast: వాళ్లంతా నిర్దోషులే.. ముంబయి పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు!

Also Read :  తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత

a-massive-robbery | robbery | gold jewelry sale | jewelry | theft

Advertisment
Advertisment
తాజా కథనాలు