Stray Dog Attack: తెలంగాణలో రెచ్చిపోయిన వీధి కుక్కలు.. ఒక్కరోజే 25 మంది..

మెదక్ జిల్లా తూప్రాన్‌లో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఒక్కరోజే 25 మందిపై దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారులు తీవ్రంగా గాయపడటం అందరినీ కలచివేస్తుంది. కన్ను, ముక్కు, కాలు ఇలా శరీర భాగాలపై కరిచి రక్తం కళ్ల చూశాయి. ఈ సంఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టించింది.

New Update
telangana Stray dogs attack 25 people in Medak district Thupran

telangana Stray dogs attack 25 people in Medak district Thupran

తెలంగాణలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఒక్కరోజే దాదాపు 25 మందిపై దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారులు తీవ్రంగా గాయపడటం అందరినీ కలచివేస్తుంది. కన్ను, ముక్కు, కాలు.. ఇలా శరీర భాగాలపై కరిచి రక్తం కళ్ల చూశాయి. మెదక్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా

Stray Dog Attack

మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఆదివారం ఘోరం జరిగింది. వీధి కుక్కలు నిన్న ఒక్కరోజే 25 మందిపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచాయి. ఈ దాడిలో 10 ఏళ్ల లోపు చిన్నారులు ఐదుగురు ఉండటం ఆందోళన కలిగిస్తుంది. అందులో 1వ వార్డుకు చెందిన విశాల్‌-లిఖిత దంపతుల 3 ఏళ్ల కుమారుడు అనిరుధ్‌ ఇంటి ముందు ఆడుకుంటుండగా.. కుక్క ఒక్కసారి దాడి చేసింది. ఈ దాడిలో ఆ బాలుడి కన్నుకు తీవ్రంగా గాయమైంది. గమనించిన తల్లిదండ్రులు ఆ కుక్కను తరిమేసి.. చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. 

Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?

అలాగే 2వ వార్డుకు చెందిన సురేశ్‌-శిరీష దంపతుల 8 ఏళ్ల కుమారుడు రితీశ్‌‌పై కూడా కుక్క దాడి చేసి గాయపరిచింది. దీంతో ఆ బాలుడికి ప్రథమ చికిత్స కోసం మెదక్‌కు తరలించారు. ఇది మాత్రమే కాకుండా ఆదివారం స్థానికంగా బోనాల జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా పలువురు చిన్నారులను కుక్కలు తీవ్రంగా గాయపరిచినట్లు స్థానికులు తెలిపారు. దీని అనంతరం తూప్రాన్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో దాదాపు 25 మందికి పైగా బాధితులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు.  

Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే

Also Read: పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్‌

 crime news | stray-dog-attack | dog-attack

Advertisment
Advertisment
తాజా కథనాలు