Indigo Plane: మళ్లీ భయపెడుతున్న వరుస విమాన ప్రమాదాలు

ఇండిగో విమానాల్లో కూడా వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం తిరుపతి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. శనివారం మరో ఇండిగో విమానానికి మరో పెను ప్రమాదం తప్పింది.

New Update
Indigo Plane

Indigo Plane

ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. అలాగే ఇప్పుడు ఇండిగో విమానాల్లో కూడా వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం తిరుపతి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఏసీ పనిచేయకపోవడంతో విమానం తిరిగి రేణిగుంట విమానాశ్రయంలోనే ల్యాండ్ అయ్యింది.

Also Read: ఛీ..ఛీ మరీ ఇలా దిగజారిపోయారా.. అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి

ల్యాండింగ్ క్లియరెన్స్‌ ఆలస్యం కావడంతో కొద్దిసేపు ఆ విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. టేకాఫ్‌కు ముందు ఫిట్‌నెస్‌ను కూడా చెక్‌ చేయరా అంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రేణిగుంట-హైదరాబాద్ విమాన సర్వీసును ఇండిగో సంస్థ రద్దు చేసింది. అంతేకాదు ప్రయాణికులకు డబ్బులు వాపస్ ఇస్తామని ప్రకటించింది.    

Also Read: భార్య చేతిలో బలైన మరో భర్త.. సాంబారులో విషం కలిపి హత్య

మరోవైపు శనివారం మరో ఇండిగో విమానానికి మరో పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి నాగ్‌పూర్ వెళ్లిన విమానం ల్యాండింగ్ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో విమానం లోపల ఉన్న ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఇండిగో విమానం శనివారం ఉదయం ముంబై నుంచి నాగ్‌పూర్‌కు బయల్దేరింది. అక్కడ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఇబ్బంది పడింది. దారి సరిగా కనిపించకపోవడంతో పైలట్ విమానాన్ని మరోసారి గాల్లోకి తీసుకెళ్లారు. ఇలా దాదాపు 15 నిమిషాల పాటు విమానాన్ని గాల్లోనే తిప్పారు. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక.. ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే పైలట్ ఆ విమానాన్ని మరోసారి కిందికి తీసుకొచ్చి సురక్షితంగా ల్యాండింగ్‌ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు